Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ చార్జీషీట్ లో కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది.
PM Narendra Modi congratulated RRR film team: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రికార్డు సృష్టించింది ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా బుధవారం ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘‘నాటు నాటు’’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ గెలుచుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న…
AAP's big win in Delhi Municipal Corporation elections: ఢిల్లీ ప్రజలు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఢిల్లీని ఆప్ కైవసం చేసుకుంది. 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టింది. బీజేపీ కంచుకోటగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ)ని చీపురు పార్టీ గెలుచుకుంది. మొత్తం 250 స్థానాలు ఉన్న డీఎంసీ ఫలితాలు వెల్లడయ్యాయి. 134 వార్డులను ఆప్ గెలుచుకోగా.. 104 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్…
Minister Satyender Jain's lavish meal in jail: ఢిల్లీలో బీజేేపీ వర్సెస్ ఆప్ గా మారింది రాజకీయం. ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన మరో వీడియోను రిలీజ్ చేసింది బీజేపీ. కొన్ని రోజుల క్రితం సత్యేందర్ జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసి బీజేపీ, తాగా మంత్రి విలాసవంతమైన భోజనం గురించి వీడియో విడుదల చేసింది. ఇది మరోసారి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అయింది.…
Delhi Lt Governor Acts Against Official Amid Row With AAP: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత కొన్ని రోజులుగా ఎల్జీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఓ ఉన్నతాధికారి కార్యాలయాని తాళం వేయాల్సిందిగా ఎల్జీ వీకే సక్సేనా ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలోని డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్(డీడీసీ) వైస్ చైర్‌పర్సన్ జాస్మిన్ షా తన కార్యాలయాన్ని ఉపయోగించకుండా…
తీవ్ర వాయుకాలుష్య నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పిల్లల జీవితాలను ఆడుకోవడం మానేసి స్కూళ్లను మూసివేయాలని బీజేపీ కోరింది. ఢిల్లీలో పార్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పనిచేస్తున్నారని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల విమర్శించారు. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Abhishek Rao's custody extended in Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ), ఈడీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే అభిషేక్ రావును లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఈ నెల 9న అరెస్ట్ చేసింది. మరుసటి రోజునే కోర్టు ముందు హాజరుపరిచారు. నేటితో అభిషేక్ రావు కస్టడీ ముగిసింది.
Delhi Liquor Policy Case-ED raids: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది ఈడీ. ఈ రాష్ట్రాల్లో మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్వర్క్ కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
Punjab Politics- Governor vs CM: పంజాబ్ రాష్ట్రంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మధ్య వివాదం చెలరేగుతోంది. బలపరీక్ష నిర్వహించి సభలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం భగవంత్ మాన్ అనుకున్నప్పటి నుంచి గవర్నర్, సీఎంల మధ్య వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే తాజాగా భగవంత్ మాన్ కోరిన మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చాలా దయ’’తో గవర్నర్ మా అభ్యర్థనను అంగీకరించారని.. స్పీకర్ కల్తార్ సింగ్ సంధ్వన్ ట్వీట్…
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఈ స్కామ్ లో ముడపుల విషయంలో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఉన్న కంపెనీలకు హైదరాబాద్ కంపెనీల నుండి భారీగా ముడుపులు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. శ్రీనివాసరావుకు చెందిన పలు కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఆధారాలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ లిక్కర్ స్కామ్ కేసులో…