Arvind Kejriwal: ఆప్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. కర్ణాటకలో అధికారంలోకి వస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే ఉంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో పర్యటించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రావణుడి అహంకారం లాగా.. కేంద్రానికి కూడా అహంకారం వుందని విమర్శించారు. అందుకే సాగు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. రైతులతో చెలగాటాలొద్దని తాము బీజేపీని పదే పదే హెచ్చరించినా.. పెడ చెవిన పెట్టిందని, చివరికి సాగు చట్టాను వెనక్కి తీసుకుందన్నారు. ప్రజలకు పాఠశాలలు, ఆసుపత్రులు, ఉచిత విద్యుత్, ఉచిత రవాణా మరియు ఉచిత నీరు కావాలంటే, వారు ఆప్‌కి ఓటు వేయాలని బెంగళూరులో జరిగిన రైతు ర్యాలీలో పిలుపునిచ్చారు కేజ్రీవాల్..
Read Also: Nampally Court: బంజారాహిల్స్ డ్రగ్ కేసు.. నిందితులకు కోర్టులో చుక్కెదురు
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
- Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
ఢిల్లీ, పంజాబ్‌లలో మాదిరిగానే కర్ణాటకలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కేజ్రీవాల్.. అవినీతికి వ్యతిరేకంగా చట్టం చేయాలని డిమాండ్ చేసినప్పుడు మేం, సామాన్య ప్రజలు రాజకీయాల్లోకి రావాలని సవాలు చేసాం. మేము రాజకీయ పార్టీని ఏర్పాటు చేసాం. మా మొదటి ప్రభుత్వం ఢిల్లీలో మరియు తరువాత పంజాబ్‌లో ఏర్పడింది. ఇప్పుడు, మేము మా తదుపరి ప్రభుత్వాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేస్తాం అన్నారు.. కర్నాటకలో అవినీతి గురించి కేజ్రీవాల్ మాట్లాడుతూ, గత కాంగ్రెస్ ప్రభుత్వం 20 శాతం కమీషన్ ప్రభుత్వం.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని విమర్శించారు.. కర్నాటక గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ వసూలు చేశారని సూసైడ్ నోట్‌లో ఆరోపించిన సివిల్ కాంట్రాక్టర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు.
ఢిల్లీలో సున్నా శాతం కమీషన్ ప్రభుత్వం ఉంది.. ఎందుకంటే ఢిల్లీలో హార్డ్ కోర్ నిజాయితీ ప్రభుత్వం ఉంది. ఒక్క పైసా కూడా లంచంగా తీసుకోబడదు అన్నారు కేజ్రీవాల్.. అత్యంత నిజాయితీ గల ప్రభుత్వమని ప్రధాని నరేంద్ర మోడీ సర్టిఫికేట్ పొందామని.. తనపై, డిప్యూటీ మనీష్ సిసోడియాతో పాటు 17 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ, ఆదాయపు పన్ను, ఢిల్లీ పోలీసులు దాడులు నిర్వహించారని, అయితే, ఏజెన్సీలు ఏమీ కనుగొనలేకపోయాయని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న రౌడీలు, పోకిరీలు, అనైతికత, అవినీతిపరులు అందరూ ‘ఒకే రాజకీయ పార్టీకి’ వెళతారని ఎద్దేవా చేశారు.. ఒక మంత్రి కొడుకు రైతులపైకి జీపు ఎక్కించి చంపేస్తాడు, కానీ, అతని తండ్రికి మంత్రి పదవి ఇస్తారు. ఎవరు అత్యాచారం చేసినా ఘనస్వాగతం లభిస్తుందని మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
తాజావార్తలు
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
-
Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
-
KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!