సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాడు కాంగ్రెస్‌లో మార్పులు.. చేర్పులు చోటుచేసుకున్నాయి. తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా కెఎస్. అళగిరి స్థానంలో సెల్వపెరుంతగై నియమితులయ్యారు
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరయ్యారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్.. కరెంట్ వెలుగులు తెచ్చిందే కాంగ్రెస్.. కాంగ్రెస్ కరెంట్ తెస్తే.. కాంగ్రెస్ కావాలా..? కరెంట్ కావాలా..? అని కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ వేయడానికి మధిర రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తుల, అభిమానులతో కలిసి ఆయన వెళ్లి నామినేషన్ వేశారు
తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
కార్యకర్తలే తన బలమని.. మధిర నియోజకవర్గ ప్రజలే తన ఊపిరి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చడమే తన ఆశయమని ఆయన వెల్లడించారు.
సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలో బుద్ది చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని రామప్ప దేవాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పూజలు చేసి దేవున్ని వేడుకున్నారని ఆయన వెల్లడించారు.
మాయల పకీర్ లాంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ సబండ వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షాలు నెరవేర్చకుండా దగా చేశారు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
ప్రశాంతంగా ఉన్న దేశంలో మతకల్లోలం సృష్టించడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన కామెంట్స్ వల్ల మతకల్లోలానికి దారి తీసే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు బాధను కలిగించాయన్నారు.