ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ వేయడానికి మధిర రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తుల, అభిమానులతో కలిసి ఆయన వెళ్లి నామినేషన్ వేశారు. మధుర నియోజకవర్గానికి నాలుగోసారి భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.. ఇక, నాలుగోసారి గెలిచేందుకు తన నామినేషన్ ను భట్టి విక్రమార్క దాఖలు చేశారు.
Read Also: Vikarabad: ఎన్నికల వేళ తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో మళ్లీ సారా తయారీ కేంద్రాలు
ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అంటూ మండిపడ్డారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి అని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో నామినేషన్ కు వెళుతున్న వేళ ఇలా ఐటీ దాడుల పేరుతో బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని హెచ్చరించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని భట్టి విక్రమార్క తెలిపారు.