తెలంగాణ వెలిగిపోతుందని, 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనే వస్తుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పోలంపల్లి గ్రామంలో పాదయాత్రలో లేఖను సీఎల్పీ నేత విడుదల చేశారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరగుపల్లిలో ఆయన యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గాంధీజీ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మార్గం ప్రపంచ మానవాళికి దిశానిర్దేశమన్నారు. ప్రస్తుతం దేశంలో అనేక రకాల అశాంతి, విభజన చోటు చేసుకుంటుందన్నారు.
షెకావత్ జీ.. మీ తీరు చూస్తుంటే అరిచే కుక్క కరవదు అన్న సామెత గుర్తొస్తోందని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతి పై చర్యలకు కాంగ్రెస్ పదే పదే డిమాండ్ చేస్తే మీరు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు మీరే అవినీతి జరిగిందంటున్నారని ప్రశ్నించారు. మాటలు సరే చర్యల సంగతి చెప్పండి సార్! అంటూ ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి విమర్శల గుప్పించారు. ట్విటర్ వేదికగా ఆయన పలు వార్తాపత్రికల పేపర్లను ఆయన సోషల్…
దేశంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అది రాబోయే తరాలకు ప్రమాదకరం అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరుతో ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేపట్టారు భట్టి విక్రమార్క. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక విషయాలు ప్రస్తావించారు. తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మోడీ ప్రయత్నించడం పట్ల లౌకికవాదులు కళ్ళు తెరవాలన్నారు. సీఎల్పీ నేతగా తాను రాష్ట్రమంతా యాత్రలు చేస్తా. పీసీసీ అధ్యక్షుడిగా…
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని అంకమ్మ దేవాలయం నుంచి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా అంకమ్మ దేవాలయంలో ఆయన భార్య మల్లు నందిని భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామాల్లోని ప్రజలను పలకరిస్తూ వారి వ్యక్తిగత సమస్యలు వింటూ భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు. KCR : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా.?ఆ అవసరం…
కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత భట్టి విక్రమార్క రేపటినుంచి మళ్లీ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా నిలిచి పోయిన పాదయాత్ర కొనసాగించనున్నారు. నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునేందుకు, అదేవిధంగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వచ్చేందుకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మార్చ్ పేరిట గత నెల 27న ముదిగొండ మండలం యడవెల్లిలో పాదయాత్రను చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల వల్ల 102 కిలోమీటర్ల దూరం కొనసాగిన యాత్ర గంధసిరి వద్ద…
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వివిధ ఉద్యోగాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్ యూ ఐ ఆందోళనలకు దిగింది. ఈ డిమాండ్ తోనే టీఎస్‌పీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు ఎన్ ఎస్ యుఐ కార్యకర్తలు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్ ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్…