సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ( గురువారం ) కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భట్టి నివాళులు ఆర్పించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దర్శనికత, ఆయన ఆలోచనలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలి అని తెలిపాడు.
Read Also: Indian Economy: చైనా కన్నా ఎక్కువ.. తొలి త్రైమాసికంలో 7.8 వృద్ధిరేటు..
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానించాల్సిందేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే ధారపోశారు అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి నాయకుడి బిడ్డ కాంగ్రెస్ లోకి రావడం మంచి పరిణామమే.. నా పాదయాత్ర మార్చి 16న మొదలై జులై 2న ముగిసింది. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్నా.. నాకు సంహరించిన వారితో కలిసి తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని బయలుదేరామని భట్టి అన్నారు.
Read Also: Gurukula Students: అమెరికా చదువులకు గురుకుల విద్యార్ధులు.. 30 మందిలో ఏపీ నుంచే ఐదుగురు
అయితే, దారి మధ్యలో ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధిని దర్శించడం జరిగింది అని భట్టి విక్రమార్క తెలిపారు. వైఎస్సార్ గారితో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా రాజశేఖర్ రెడ్డితో కలిసి ముందుకు సాగాను అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ పార్టీలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.