Baba Venga Prediction: బాబా వెంగా పేరు ప్రపంచానికి పరిచయం చేయాల్సిన పనిలేదు. తాను ప్రపంచానికి వీడ్కోలు పలికి దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది. కానీ ఆమె ద్వారా చేసిన అంచనాలు ఇప్పటికీ ప్రపంచ దిశను నిర్ణయిస్తాయి.
Fertiliser, Labour Cost Hike: ఆగస్టులో వర్షపాతం తక్కువగా ఉండటంతో రైతుల కష్టాలు ఇప్పటికే పెరిగాయి. ఇప్పుడు పెరుగుతున్న కూలీ ఖర్చులు వ్యవసాయాన్ని మరింత కష్టతరం చేశాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి.
Weather: తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి కారణంగా నగరంలో పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి.
Danger to Chennai and Kolkata: పెరుగున్న వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓజోన్ లేయర్ దెబ్బతినడంతో పాటు భూమిపై హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని, దీని వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ముప్పు ఏర్పడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
ఇండోనేషియాలోని బాలిలో ఓ ప్రముఖ హోటల్ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గాన్ని కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు.
ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలికి చేరుకున్నారు. బాలిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
వాతావరణ మార్పులపై పోరాటంలో అత్యంత ముఖ్యమైన అంశం ఐక్యత అని గుజరాత్లోని ఏక్తా నగర్లో గురువారం జరిగిన 'మిషన్ లైఫ్' గ్లోబల్ లాంచ్లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్తో కలిసి గురువారం ఏక్తా నగర్లో 'మిషన్ లైఫ్' ఉద్యమాన్ని ప్రారంభించారు.