Climate Change: మానవ మనుగడకే సవాల్ … ఉపఖండంలో వేగంగా వాతావరణ మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Climate Change: భారత ఉపఖండంలో వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో మానవ వనుగడకు ముప్పుగా వాటిల్లనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశ సగటు ఉష్ణోగ్రత దాదాపు 0.7 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES)అంచనా వేసింది. శతాబ్ది చివరి నాటికి వేడి తరంగాల తీవ్రత 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశం ఉందనీ, భారతదేశంలో వాతావరణ మార్పుల వేగంగా సంభవిస్తున్నాయని తెలిపింది. భూతాపం, వాతావరణ మార్పులు కలవరపెడుతున్నాయి. వేసవికాలంలో భరించలేని వడగాల్పులు.. ఆ వెంటనే వర్షకాలంలో ఊహించని ఉత్పాతాన్ని సృష్టించే భారీ వర్షాలు.. ఏకంగా మానవ మనుగడకే సవాల్ విసురుతున్నాయి. భారత ఉపఖండంలో చోటుచేసుకుంటున్నా.. ఈ వాతావరణ మార్పులు యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి విపత్తుకర పరిస్థితులు ఎదుర్కొంటున్న మనిషి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ప్రజల్లో చైతన్యం నింపడంలో పర్యవరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) నివేదిక హెచ్చరిస్తోంది.
Read also: Adah Sharma: అదా శర్మకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) 2020లో ‘భారతదేశంలో వాతావరణ మార్పుల అంచనా అనే నివేదికను ప్రచురించింది. ఇందులో భారత ఉపఖండంపై వాతావరణ మార్పులను సమగ్ర అంచనా వేసింది. 1901-2018 సమయంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత దాదాపు 0.7 డిగ్రీలు పెరిగిందని పేర్కొంది. అలాగే.. 1950-2015లో రోజువారీ వర్షపాతం తీవ్రత (వర్షపాతం తీవ్రత > 150 మిమీ) 75 శాతం పెరిగిందని తెలిపింది. అదే సమయంలో భారతదేశంలో కరువుల పరిస్థితులు పెరిగాయని నివేదించింది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సముద్ర మట్టం కూడా పెరిగిందనీ, గత రెండున్నర దశాబ్దాలలో (1993-2017) 3.3 మి.మీ. పెరిగినట్టు సూచించింది. ఇదిలా ఉంటే.. 1998-2018 మధ్యకాలంలో అరేబియా సముద్రంలో తరుచు తుఫానులు సంభవిస్తున్నాయని హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ (IMD) భారతదేశ వాతావరణాన్ని మామూలుగా పర్యవేక్షిస్తుంది. “వార్షిక వాతావరణ సారాంశం” అనే పేరిట వార్షిక ప్రచురణను విడుదల చేస్తుంది. అలాగే.. IMD నెలవారీ వాతావరణ నివేదికలను కూడా జారీ చేస్తుంది. వార్షిక వాతావరణ సారాంశం సంబంధిత కాలంలో సంభవించే ఉష్ణోగ్రత, వర్షపాతం, తీవ్రమైన వాతావరణ సంఘటనల గురించి సమాచారాన్ని అందిస్తోంది. వాతావరణ మార్పులపై పలునేతలు అడిగిన ప్రశ్నకు కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!