Pneumonia Cases: దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ పెద్ద సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు, 24 గంటల వ్యవధిలో 166 కొత్త వ్యక్తులు కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. వీటిలో అత్యధికంగా 166 కొత్త కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. వాతావరణంలో మార్పుల కారణంగా, చాలా మంది జ్వరం బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న చలి గాలులు, చలితో చిన్న పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, న్యుమోనియా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి లక్షణాలతో ఇప్పటికే 50 మంది హైదరాబాద్‌లోని నీలోఫర్‌లో చేరారు. జలుబు, తీవ్రమైన దగ్గు, జ్వరం, గొంతునొప్పితో ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొందరికి 5-6 రోజులైనా జ్వరం తగ్గకపోగా, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే న్యుమోనియాగా గుర్తించి ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. న్యుమోనియా లక్షణాలు కనిపించినప్పుడు యాంటీబయాటిక్స్ స్వీయ-నిర్వహణ చేయకూడదని వైద్యులు సలహా ఇస్తారు.
Read also: IND vs PAK: పాకిస్తాన్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే..!
ఈ సీజన్ లో చిన్న పిల్లలు ఎక్కువగా న్యుమోనియా బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. వాటి చుట్టూ వెచ్చని వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం బయటి గాలిలో తిప్పడం వల్ల పిల్లలు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీని వల్ల జ్వరం, దగ్గు, తుమ్ములు, తరచుగా ఊపిరి పీల్చుకుంటున్నట్లు చెబుతున్నారు. చల్లని వాతావరణం నుంచి పిల్లలను రక్షించేందుకు కంగారు మదర్ కేర్ చాలా కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. కంగారు తన బిడ్డను పొట్టలో పర్సులో పెట్టుకున్నట్లు, తల్లి తన బిడ్డను తన ఛాతీపై పడుకోబెట్టడం వల్ల తల్లి శరీర ఉష్ణోగ్రత బిడ్డను కాపాడుతుందని చెబుతారు. తల్లిపాలు కూడా సరిగ్గా ఇస్తారని… దానివల్ల పిల్లల బరువు పెరుగుతుందని, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ కాలం కంగారూ మదర్‌కేర్‌లో పిల్లలను ఉంచాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంతే కాకుండా.. ఇంటిలో న్యుమోనియా బారిన పడకుండా.. ఒక చిన్న బాక్సులో బొగ్గులతో వేడిని చేసి ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దాని వల్ల ఇంట్లో వేడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి రోగబారిన పడకుండా ఉండొచ్చని కొందరు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా ఇంట్లో వేడి ఉండటం వల్ల పిల్లలకు కూడా వేడి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు.
Coronavirus in India: మళ్లీ కరోనా అలజడి.. ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు