క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ చేస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ చేస్తున్నట్టు వారే స్వయంగా వెల్లడించారు కూడా. అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రసారం కానుంది. తాజాగా బయటకు వచ్చిన ఈ యాడ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.…
Vikrant Rona రిలీజ్ డేట్ టీజర్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. “ఇది అద్భుతంగా ఉంది ! కిచ్చ సుదీప్ అడ్వెంచర్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ టీజర్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చిరు సోషల్ మీడియాలో “విక్రాంత్ రోనా” టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక సరికొత్త జోనర్ లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బండారితో పాటు చిత్రబృందానికి విషెస్ అందించారు. హిందీలో ‘విక్రాంత్ రోనా’ విడుదల తేదీ టీజర్‌ను…
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం… ఈరోజు తెలుగు వారికి మరో కొత్త సంవత్సరం ప్రారంభం. తెలుగు వారు సాంప్రదాయకంగా భావించే ఉగాది పండగను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగ చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 2, శనివారం వచ్చింది. ఈ పండగ సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా తమ ఇంటిని…
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఏమాత్రం రెస్ట్ లేకుండా ప్రమోషన్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ విడుదలకు కాస్త సమయం ఉండడంతో రిలాక్స్ అవుతున్నారు. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తాజా చిత్రం కొత్త షెడ్యూల్లో పాల్గొనవలసి ఉంది. కానీ దానికి ముందు ఆయన తన తండ్రి “ఆచార్య”ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు, ఇందులో చెర్రీ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. Read Also…
RRRలో తన అద్భుతమైన నటనతో అభిమానులను అలరించిన చరణ్ నెక్స్ట్ మూవీ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. “ఆచార్య”లో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఆచార్య’లో సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, సౌరవ్ లోకేష్, కిషోర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్,…
Mishan Impossible చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాప్సి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహించారు. ఈ హై-ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీలో హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి అతిధి పాత్రలో నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. బుధవారం సాయంత్రం 6…
Ram Charan Birthday Celebrations ఆదివారం రోజు శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, బాబీతో పాటు యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ “రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకెవరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్ రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసిన చెర్రీ ఆ బాధ్యతను వీవీ వినాయక్ కు అప్పగించారు. ఆయన కూడా…
Mega154 కోసం మెగాస్టార్ యాక్షన్ లోకి దిగారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మెగా154’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా చిరంజీవి, ఫైటర్స్‌పై ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్‌తో బృందం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. యాక్షన్ బ్లాక్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షించగా, హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో మేకర్స్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తోన్న శృతి హాసన్ త్వరలో సెట్స్‌పైకి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 36వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఏ విషయం ఉన్నా, విశేషమైన సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం, విష్ చేయడం ట్రెండ్ గా మారింది. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ సెలెబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగానే తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏదైనా మంచి వార్త అయితే విష్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో చరణ్…
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, సన్నిహితుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్‌లతో పాటు ప్రివ్యూకి చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే…