బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27వ తేదీన తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఆయన స్నేహితులు కూడా సల్మాన్ కు పుట్టిన రోజు విషెస్ అందించడం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సీనియర్ హీరోలు వెంకటేష్ దగ్గుబాటి, చిరంజీవి సల్మాన్‌కు స్వీట్ బర్త్ డే విషెస్ తో…
ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ ఈ ఆనందకరమైన సందర్భాన్ని జరుపుకోవడంలో బిజీగా ఉన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తమ అభిమానులకు, ప్రియమైన వారికి సోషల్ మీడియాలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ స్పెషల్ వీడియో ద్వారా తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.…
మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ శనివారం చేసిన ట్వీట్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. వీరు తమ తమ ట్వీట్స్ తో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అటు ఎపి గవర్నమెంట్ కు సందేశాలను పంపగలిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో పెద్ద రగడ జరుగుతోంది. జీవో 35ను అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తే… కొంత మంది ఎగ్జిబిటర్స్ కోర్టుకు వెళ్ళి సింగిల్ జడ్జ్ తీర్పుతో దానిపై స్టే తీసుకు వచ్చారు. అయితే…
తెలంగాణాలో సినిమా టికెట్ ధరల పెంపుపై స్టార్ హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఉదయం చిరంజీవి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం నూటికి…
తెలంగాణాలో టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీకి మేలు కలిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ఈ మేరకు “తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్…
మెగాస్టార్ చిరంజీవి జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసారు. చిరు తన పెరట్లో కొన్ని నెలల క్రితం పొట్లకాయ విత్తనాలను నాటగా, అది పెరిగి, ఇప్పుడు పొట్లకాయలు కూడా అయ్యాయట. దీంతో చిరు తాను నాటిన విత్తనం పెరిగి, ఆ తీగకు కాసిన పొట్లకాయలను చూసి ఆనందంలో మునిగిపోయారు. తెల్లటి చొక్కా ధరించి, చిరు తన గార్డెన్ నడవలో నడుస్తూ సెల్ఫీ వీడియోలో కనిపించారు. చిరు తన ఫేవరెట్ అవుట్డోర్ యాక్టివిటీ,…
(డిసెంబర్ 24న ‘కిరాయి రౌడీలు’కు 40 ఏళ్ళు)మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘కిరాయి రౌడీలు’ చిత్రం డిసెంబర్ 24తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. శ్రీక్రాంతి చిత్ర పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో టి.క్రాంతికుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో చిరంజీవికి జోడీగా రాధిక నటించారు. 1981 డిసెంబర్ 24న ‘కిరాయిరౌడీలు’ విడుదలయింది. అంతకు ముందు అదే సంవత్సరంలో క్రాంతికుమార్ నిర్మించిన ‘న్యాయం కావాలి’లో చిరంజీవి, కోదండరామిరెడ్డి తొలిసారి కలసి పనిచేశారు. వారిద్దరి…
దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్ ప్లాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు రాజమౌళి బాలీవుడ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగిందన్న విషయం తెలిసిందే. అది త్వరలోనే ఓ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇక తాజాగా ప్రో కబడ్డీ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి చేసి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం జక్కన్న తన…
యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’ చిత్రం టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. తాజాగా ‘గాడ్సే’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్విట్టర్ లో ఈ టీజర్ లింక్ ను షేర్ చేస్తూ చిరు హీరో సత్యదేవ్, దర్శకుడు గోపి, సినిమా నిర్మాత సి కళ్యాణ్ లను అభినందించారు. టీజర్ విషయానికొస్తే… 1.18 నిమిషాల నిడివితో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. గంటల వ్యవధిలోనే చిత్రబృందం అన్ని ప్రధాన నగరాలను కవర్ చేస్తూ వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలకు సిద్ధమవ్వడంతో చిత్రబృందం క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కు సర్వం సిద్ధం అయ్యింది. లాస్ట్ మినిట్…