మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ ఏప్రిల్ 14 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ రానుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇప్పటివరకు ఒక సీన్ లేదా, ఒక ఫ్రేమ్ లో మాత్రమే కనిపించి మెప్పించగా.. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య ఎక్కువ సీన్స్ ఉండనున్నాయని తెలియడంతో మెగా అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇక మెగా అభిమాన్లులతో పాటు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రానున్నాడట.. ఇప్పటికే ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ రానున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఆయన తో పాటు జనసేనాని కూడా రానున్నట్లు సమాచారం. ఈ విషయం పవన్ కు చిరు చెప్పడం, పవన్ కూడా తన షెడ్యూల్స్ ని సర్దుబాటు చేసుకొని వస్తానని చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తలో నిజమెంత అనేది తెలియకపోయినా మెగా అభిమానుల్లో మాత్రం ఇది నిజమైతే బావుండు అని కోరుకుంటున్నారు. ఒకే వేదికపై మెగాస్టార్, పవర్ స్టార్ , మెగా పవర్ స్టార్ కనిపిస్తే మెగా అభిమానులకు పండగే పండుగ.. ఈ మెగా ఫ్యామిలీ అంతా చివరగా సైరా ఈవెంట్ లో కలిసి సందడి చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆచార్య తో ఆ అద్భుతం జరుగుతుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి.. మేకర్స్ అధికారిక ప్రకటన ఎప్పుడిస్తారో..