ఈరోజు అంటే ఏప్రిల్ 10, ఆదివారం నాడు రామ నవమిని జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో నవమి తిథి నాడు రామ నవమిని జరుపుకుంటారు. త్రేతా యుగంలో అయోధ్యలో రాజు దశరథుడు, కౌశల్యకు శ్రీరాముడు జన్మించగా, ఆ కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకుంటారు హిందువులు. ఈ రోజు పవిత్రమైన రామ నవమితో చైత్ర నవరాత్రి ముగియనుంది. విష్ణువు ఏడవ అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీరాముని పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. పద్నాలుగేళ్ల అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో ఉన్న భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఈ పండుగ హిందువులకు పెద్ద వేడుక అని చెప్పాలి. కాగా శ్రీరామ నవమి సందర్భంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అభిమానులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు! ఒక కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా,రాజు గా శ్రీ రామ చరితం అన్ని విధాలా ఆదర్శ ప్రాయం. ఆ మహనీయుడి జీవితం మన జీవన గమనానికి తారక మంత్రం ! #HappySriRamaNavami pic.twitter.com/ApF4rJ6NWK
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2022