టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హనుమాన్ జయంతి సందర్భంగా విష్ చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు అది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. చిరు తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోలో హీరో రామ్ చరణ్ ఓ వానరంతో కలిసి కనిపిస్తున్నాడు. మన దేశంలో వానరాన్ని హనుమంతుడిగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఇక వీడియో విషయానికొస్తే…. “ఆచార్య” సినిమా షూటింగ్ సెట్ లో మేకప్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు చెర్రీ. అదే సమయంలో అకస్మాత్తుగా అక్కడికి ఓ కోతి వచ్చి చెర్రీ వైపు చూస్తూ ఉండిపోయింది. దాన్ని గమనించిన రామ్ చరణ్ కోతికి కొన్ని బిస్కెట్లు ఇచ్చాడు. ఆ సమయంలో వానరం చెర్రీకి చాలా దగ్గరగా వచ్చి కూర్చుని తినడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హనుమాన్ జయంతి రోజున ఇలాంటి వీడియోను షేర్ చేసి అభిమానులను థ్రిల్ చేశారు చిరు. ఇక ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ భక్తుడన్న విషయం అందరికీ తెలిసిందే.
Read Also : Harish Shankar : సల్మాన్ తో మీటింగ్… అసలు రీజన్ ఇదా?
కాగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం “ఆచార్య” కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !#happyhanumanjayanthihttps://t.co/SiZ2fbdyJ0@AlwaysRamCharan
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 16, 2022