ఎట్టకేలకు సీఎం జగన్ తో టాలీవుడ్ బృందం భేటీ ముగిసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ పరిశ్రమ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టుగా కన్పిస్తోంది. తాజాగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని, నిర్మాత నిరంజన్ రెడ్డి లాంటి పలువురు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినీ పెద్దలంతా కలిసి సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు.…
టాలీవుడ్ ఆదర్శ దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 17వ పెళ్లి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే మహేష్ మాత్రం నేడు ఏపీ సీఎంతో జరగనున్న భేటీకి హాజరు కానున్నారు. అయితే ఇది కూడా మంచికే అన్నట్టుగా… ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చారు. Read Also :…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హైప్రొఫైల్ భేటీకి రంగం సిద్ధమైంది. చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ఈరోజు జగన్ను కలవడానికి బయల్దేరారు. టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమావేశానికి చిరంజీవితో పాటు తెలుగు సూపర్ స్టార్లు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివ, అలీతో పాటు మొత్తం 9 మంది హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ ధరలపై, ఇండస్ట్రీలోని పలు సమస్యలపై ఈ భేటీలో…
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం.. ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమగా మారింది.. కొందరు స్టార్లు ఓపెన్గా ప్రభుత్వాన్ని విమర్శంచడంతో ఇది మరింత రచ్చ రచ్చ అయిపోయింది.. కొందరు సినీ పెద్దలు రంగంలోకి దిగి ఎవరూ ఏమీ మాట్లాడొద్దని సూచించారు.. ఇక, మెగాస్టార్ చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఏకాంతంగా సమావేశం అయ్యారు.. ఎవ్వరూ లేకుండా ఆయన ఒక్కరే వెళ్లడాన్ని కొందరు ఆహ్వానిస్తుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, వైఎస్ జగన్-చిరంజీవి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…
సినీ పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి తలసానికి వినతిపత్రం సమర్పించామని సినీ నిర్మాత తమ్మారెడ్డ భరద్వాజ అన్నారు. ఇప్పటికే చిరంజీవి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి సమస్యల గురించి చర్చించారని ఆయన అన్నారు. ఆన్లైన్ బుకింగ్ తెస్తామని రెండు ప్రభుత్వాలు చెప్పాయని, బుక్ మై షో వాళ్ళు టికెట్పై 15 నుంచి 25 రూపాయల వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని అన్నారు.…
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 13 సంవత్సరాల తర్వాత బ్రాండ్ అంబాసిడర్ గా చేయబోతున్నారు. రాజకీయాలనుంచి తప్పుకుని ‘ఖైదీ నెం.150’తో సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన చిరు అనూహ్యవిజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం జోరుమీదున్న చిరంజీవి వరుసగా నాలుగైదు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత చిరు లైనప్ చూస్తే ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న యువహీరోలకు దీటుగా సాగుతున్నట్లు అర్థం అవుతుంది.…
ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో చర్చించారు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని. ఈ నెల 10న సీఎం జగన్ తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల సమావేశం వున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తో సినిమటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం…
మా అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా టికెట్ రేట్ల పెంపు సహా కొన్ని విషయాల మీద అస్యాన స్పందించారు. ఈ ఏడాది మోహన్ బాబు యూనివర్సిటీ ప్రారంభం అవుతుందని మంచు విష్ణు అన్నారు. ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందని, సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని ఆయన అన్నారు. ఇక సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెంచారు… ఏపీలో తగ్గించారు.. కానీ రెండు…