టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో కన్పించారు. నరసింహ స్వామి సన్నిధిలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న మెహర్ రమేష్ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నట్టు వెల్లడించారు. ఇక ఈ పిక్స్ లో దర్శకుడు మెహర్ రమేష్ తో పాటు పాపులర్ సినిమాటోగ్రాఫర్ డూడ్లీ కూడా ఉన్నారు. కాగా ప్రస్తుతం మెహర్ రమేష్ “భోళా శంకర్” సినిమాలో బిజీగా ఉన్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తొలిరోజు సినిమా షూటింగ్‌కు ముందు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందుకున్న విషయం తెలిసిందే.
Read Also : Acharya : కాజల్ రోల్ కత్తిరించేశారా ?
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, తమన్నా భాటియా కథానాయికలుగా నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. “భోళా శంకర్”పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం,
సింహాచలం 🙏🏻
Devine visit of Sri VarahlaksmiNarsimhaswamy temple 🙏🏻#SimhachalamTemple along with my dear friend &Dop @dudlyraj pic.twitter.com/sXPwKn0jp6— Meher Raamesh (@MeherRamesh) April 14, 2022