ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ల మధ్య గట్టి పోటీ ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఉన్న కథను బట్టి ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఒకే రోజు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్దపడుతున్నారు మేకర్స్.. ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాకే ఎక్కడలేని చిక్కులు వచ్చాయా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే యశోద సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకుంది. ఆగస్టు 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు అఖిల్ .. ఏజెంట్ తో రానున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఈ వదినా మరిదిల మధ్య పోటీ గట్టిగానే ఉందనుకోలోపు మరో భారీ సినిమా అదే రోజున రావడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా మరెంటిదో కాదు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్.
మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘లూసిఫర్’కు ఇది రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టు 11 న రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి కావడంతో మేకర్స్ త్వరగా షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక దీంతో సమంత సినిమాకు చిక్కులు తప్పవంటున్నారు. ఒకరోజు ముందు చిరు సినిమా.. యశోద తో పాటు ఏజెంట్ రిలీజ్.. తో సామ్ సినిమాకు గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ ఇది కనుక నిజమైతే ఈ రెండు సినిమాల్లో ఏదైనా వెనకడుగు వేస్తుందా అనేది చూడాలి.