ఎలాగైనా తైవాన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చైనా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. తైవాన్ గగనతలంలోకి చైనా తన జెట్ విమానాలను పంపి భయపెట్టే ప్రయత్నం చేసింది. వన్ చైనా కు ఎవరు అడ్డువచ్చినా ఊరుకునేది లేదని ఇప్పటికే చైనా స్పష్టం చేసింది. అయితే, తైవాన్‌పై చైనా దాడికి దిగితే తైవాన్‌కు అండగా ఉంటామని, వారి తరపున పోరాటం చేస్తామని ఇప్పటికే అమెరికా హామీ ఇచ్చింది. అమెరికన్ కమాండోలు ఇప్పటికే తైవాన్‌లో దిగిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, తైవాన్‌కు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చాయి.
Read: 300 మంది వాలంటీర్లతో నగ్నంగా ఫొటోలు… ఆ ప్రభుత్వం సహాయంతోనే…
యూరోపియన్ యూనియన్ దేశాల పార్లమెంట్ బృందం మూడురోజులపాటు తైవాన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తైవాన్‌తో మరింత సంబంధబాంధవ్యాలు పెంచుకోవాలని ఇప్పటికే యూరోపియన్ యూనియన్ తీర్మానం చేసింది. తైవాన్‌కు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం చైనాకు కొంత ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పాలి. మరి దీనిపై చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.