ఇండియా చైనా బోర్డర్‌లో చైనా రడగ సృష్టిస్తూనే ఉన్నది. సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం వివాదాలు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ప్రశాంతంగా ఉన్న సరిహద్దుప్రాంతాల్లో కూడా చైనా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అరుణాచల్ సరిహద్దుల్లో ఇప్పటికే వంద ఇళ్లతో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది. అక్కడికి చేరుకునేందుకు అధునాత రోడ్డు, ఎలక్ట్రిసిటీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. చైనా చేస్తున్న పనులను నిశితంగా గమనిస్తున్నామని ఇండియన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు.
Read: ఇలా చేస్తే… ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్ పనిచేస్తుంది…
ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు చైనా కన్ను సిలిగురి కారిడార్‌పై పడింది. ఈ మార్గం నుంచి ఈశాన్యభారతదేశంలోని 8 రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. ఈ చికెన్ నెక్ ప్రాంతం చాలా సున్నితమైనది. కొన్ని చోట్ల ఈ ప్రాంతం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నది. ఈ ప్రాంతం భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు సమీపంలో ఉన్నది. అదేవిధంగా చైనాలోని చుంభీలోయ ప్రాంతం ఈ చికెన్‌నెక్ కారిడార్‌కు సమీపంలో ఉన్నది. చుంభీలోయ ప్రాంతంలో సైనిక స్థావరాలను చైనా బలోపేతం చేస్తున్నది. ఇటీవలే ఈ ప్రాంతంలో 400 మంది సైనికులను రిక్రూట్ చేసుకున్నది. వారికి ఆప్రాంతంలోనే ట్రైనింగ్ ఇవ్వనున్నారు. చుంభీలోయ ప్రాంతం సిలిగురి కారిడార్‌కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంపై పట్టుసాధిస్తే తద్వారా ఈశాన్యరాష్ట్రాలతో భారత దేశానికి సంబంధాలు దెబ్బతింటాయి. ఫలితంగా ఆ ప్రాంతాలపై పట్టుసాధించవచ్చని చైనా చూస్తున్నది.