అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, తైవాన్ విషయంలోనూ రెండు అగ్రరాజ్యాల మధ్య వార్నింగ్‌ల పర్వం నడుస్తోంది.. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతివ్వడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లే అంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చారు చైనా అధినేత జిన్ పింగ్.. ఈ విషయాన్ని చైనా మీడియా వెల్లడించింది… ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారిపోయింది.. జో బైడెన్, జిన్‌పింగ్ మధ్య ఇవాళ వర్చువల్ సమావేశం నిర్వహించారు.. దాదాపు మూడున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ధ్వైపాక్షిక సంబంధాలతో పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది.. అయితే, తైవాన్ విషయం చర్చకు రాగానే.. జిన్‌పింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారని చైనా మీడియా పేర్కొంది..
Read Also: ఏపీ కేబినెట్ వాయిదా
సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న తైవాన్ విషయంలో.. తైవాన్‌ను తమ భూభాగమని వాదిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ.. ఈ వ్యవహారంలోఅమెరికాను జోక్యం చేసుకోవద్దని పరోక్షంగా హెచ్చిరిస్తూ వస్తోంది.. ఇక, స్వాతంత్ర్యం కోసం తైవాన్ అధికారులు అమెరికాపై అధారపడుతున్నారు.. అంతేగాక యూఎస్‌లోని కొంతమంది తైవాన్‌ను ఉపయోగించి చైనాను నియంత్రించాలని చూస్తున్నారు.. ఇది చాలా ప్రమాదకరమైన విషయం.. నిప్పుతో ఆడుకోవడమేనని.. నిప్పుతో చెలగాటమాడితే కాలిపోతారు అంటూ.. చైనా అధ్యక్షుడు స్పష్టం చేసినట్టు చైనా మీడియాలో కథనాలు వచ్చాయి.. అయితే, అమెరికా, చైనా మధ్య నెలకొన్న వైరుధ్యాలను తొలగించేందుకు, ధ్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరిచేందుకు ఈ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.. వైట్‌హౌజ్ నుంచి జో బైడెన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ఉన్న పోటీ ఉద్ధేశపూర్వకంగా అనాలోచితంగా విభేదాలుగా మారకుండా చూసుకోవాలని సూచించగా.. బైడెన్ నా పాత మిత్రుడే.. కానీ ప్రత్యర్థులు మరింత సన్నిహితంగా పనిచేయాలని ఆకాంక్షించారు జిన్‌పింగ్.. అయితే, తైవాన్ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తుందనేది ఆస్తికరంగా మారింది.