పాకిస్తాన్ నుండి చైనాకు రేడియోధార్మిక పదార్థాలను కలిగి ఉన్న ఒక కార్గో షిప్‌ను ముంద్రా పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదానీ పోర్ట్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం .. అనేక కంటెయి నర్‌లతో కూడిన షిప్‌మెంట్‌లో ఒక ప్రమాదకర కార్గో” ఉన్నదనే ఒక విదేశీ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉమ్మడి కస్టమ్స్, DRI బృందం ఓడరేవు లో దానిని స్వాధీనం చేసుకుంది. ముంద్రా పోర్ట్‌ను అదానీ గ్రూప్ SEZ (APSEZ)నిర్వహిస్తుంది. కార్గో నాన్-హాజర్డస్‌గా జాబితా చేయబడి నప్పటికీ, స్వాధీనం చేసుకున్న కంటైనర్లలో ప్రమాదకర రేడియో థార్మిక తరగతి 7 గుర్తులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ కంటైనర్లు ముంద్రా పోర్ట్, భారతదేశంలోని మరే ఇతర ఓడరేవు కోసం ఉద్దేశించినవి కాదని అధికారులు స్పష్టం చేశారు. వీరు పాకిస్థా న్‌లోని కరాచీ నుంచి చైనాలోని షాంఘైకి వెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఇతర తనిఖీల కోసం ముంద్రా పోర్ట్ లో కార్గోను ఆఫ్‌లోడ్ చేశారు.APSEZ ఈ ఆపరేషన్ కోసం సాధ్యమైన అన్ని సహాయాలను కస్టమ్స్, డిఆర్‌ఐ అధికారులకు అందించారు. భారతదేశాన్ని సురక్షితంగా ఉంచే ఏ చర్యకైనా పూర్తిగా సాయం చేస్తా మని, దేశ భద్రతను సీరియస్‌గా తీసుకుంటామని అదానీ గ్రూప్ పోర్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.