గతంలో అనేక అమెరికా సంస్థలు తమ కార్యాలయాలను చైనాలో నెలకొల్పాయి. అమెరికా తరువాత అతిపెద్ద మార్కెట్ చైనా కావడంతో ఆ దేశంలో తమ కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. ప్రస్తుతం చైనాలో ఆంక్షలు కఠినంగా ఉండటంతో పెద్ద పెద్ద సంస్థలు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన జాబ్ పోర్టల్ లింక్డిన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి సారించింది.
Read: డాక్టర్‌పై 20 ఏళ్ల యువతి కేసు… వైద్యుని నిర్లక్ష్యం వల్లనే…
ఇండియాలో ఇప్పటి వరకు ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, ఇప్పుడు లింక్డిన్ హిందీ వెర్షన్‌ను కూడా రిలీజ్ చేసింది. దీంతో లింక్డిన్ ప్రపంచంలోని 25 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో యాప్, డెస్క్‌టాప్ రెండు వెర్షన్స్‌లో అందుబాటులో ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.