వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహించాల్సి ఉంది. వింటర్ ఒలింపిక్స్ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నది చైనా. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఒమిక్రాన్ సవాళ్లను ఎదుర్కొని తప్పకుండా వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని చైనా చెబుతున్నది.
Read: స్మార్ట్‌ఫోన్ ఎఫెక్ట్: గతం మర్చిపోయిన యువకుడు…
మహమ్మారిని ఎదుర్కొనడంలో చైనాకు చాలా అనుభవం ఉందని, ఒమిక్రాన్ వేరియంట్ పై దక్షిణాఫ్రికా వేగంగా స్పందించినందుకు చైనా అభినందనలు తెలియజేసింది. చైనాలో ఇప్పటికీ డెల్టా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్ వంటివి విధిస్తూ మహమ్మరిని కట్టడి చేస్తున్నది చైనా.