సాధారణంగా ఉండాల్సిన ఎత్తుకంటే తక్కువ ఎత్తు ఉంటే పొట్టివాళ్లు అని అంటారు. కానీ, పొట్టివాళ్లకంటే ఇంకా తక్కువ ఎత్తు ఉంటే వారిని మరగుజ్జులు అంటారు. సాధారణంగా మరగుజ్జులు చాలా తక్కువ మంది ఉంటారు. జీన్స్ ప్రభావం కారణంగా ఇలా మరగుజ్జులుగా పుడుతుంటారు. అయితే, ఓ గ్రామంలో సగానికి సగం మంది జనాభా మరగుజ్జులే ఉన్నారట. ఆ గ్రామం ఎక్కడ ఉంది.. ఎందుకు అక్కడి ప్రజలు మరగుజ్జుగా ఉన్నారు తెలుసుకుందాం. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో యాంగ్సి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో సగం మంది మరగుజ్జులే ఉన్నారు. అంతమంది ఎందుకు మరగుజ్జులుగా ఉన్నారు.. కారణాలు ఏంటి అన్నది ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.
Read: వ్యవసాయ రద్దుపై స్పందించిన వైసీపీ
ఈ మరగుజ్జుల గ్రామంపై శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు. అక్కడి ప్రజల అభిప్రాయం ప్రకారం ఓ రోజు అర్ధరాత్రి సమయంలో ఓ మహమ్మారి 5 నుంచి 7 ఏళ్ల వయసున్న పిల్లలకు సోకిందని, అప్పటి నుంచి ఆ గ్రామంలో మరగుజ్జులుగా మారిపోయారని చెబుతున్నారు. అయితే, మరో వాదన ప్రకారం జపాన్ ఒకప్పుడు చైనాలో గ్యాస్‌ను వదిలారని, ఆ గ్యాస్ ప్రభావం వలన గ్రామంలోని ప్రజలు అలా మారిపోయారని కొందరు చెబుతున్నారు.