ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తుంటే చైనా మాత్రం కొత్త కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా తాజాగా కృత్రిమ చంద్రుడిని ఆవిష్కరించింది. భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలు చేయాలని చైనా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడికి వ్యోమగాములను పంపి పరిశోధనలు చేయాలి అంటే చంద్రుడిపై ఉన్న వాతారవణానికి వ్యోమగాములు అలవాటు పడాలి. అక్కడి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించింది. భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో ఆరోవంతు చంద్రునిపై ఉంటుంది. భూమిపై ప్రత్యేక పద్దతుల్లో చంద్రునిపై ఉండే విధంగా గురుత్వాకర్షణ శక్తిని సృష్టించింది. ఈ కృత్రిమ చంద్రుడిని చైనా జీయాంగ్సు ప్రావిన్స్‌లోని షుజౌ నగరంలో ఏర్పాటు చేశారు. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఆధారంగా చంద్రుడిపై గురుత్వాకర్షణను ఏర్పాటు చేశారు.
Read: మెగాభిమానుల్లో చిచ్చు రేపిన ఆర్జీవీ!
ఈ కృత్రిమ చంద్రునిలో రెండు చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గది, వ్యాక్యుమ్ చాంబర్ ఉన్నాయి. వ్యాక్యుమ్ చాంబర్‌లో శక్తివంతమైన అయస్కాంతాల సహాయంతో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసి గాలి లేకుండా చేశారు. ఈ గాలి లేని చాంబర్‌లోని వాతావరణానికి వ్యోమగాములు అలవాటు పడేలా చేస్తారు. 2027 వ సంవత్సరం నాటికి జాబిల్లిపైకి చాంగే 6,7,8 వ్యోమ నౌకలను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ తరువాత 2030నాటికి జాబిల్లిపైకి మనుషులను పంపాలన్నది చైనా లక్ష్యం. దీనికోసమే చైనా ప్రయత్నాలు చేస్తున్నది.