కరోనా కారణంగా మార్చి 2020 నుంచి ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. దీంతో చైనాతో వాణిస్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో ఉత్తర కొరియాలోకి కరోనా మహమ్మారి ఎంటర్ కాలేదు. రెండేళ్లుగా ఆ దేశంలోని ప్రజలు ఆహారం కొరతతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న విధానాలు, అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగాల కారణంగా ప్రపంచదేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కిమ్ తగ్గడం లేదు. గురువారం రోజున 5 నిమిషాల వ్యవధిలో రెండు క్షిపణులను ప్రయోగించారు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే జరిగిన సమావేశాల్లో కిమ్ తమ దేశ పౌరులకు ఆహరం అందించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. దానికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
Read: ఎయిర్ ఇండియా విమానంలో టాటాల తొలి ప్రకటన ఇదే…
ఒకవైపు ఆహరం కోసం ప్రయత్నాలు మొదలుపెడుతూనే మరోవైపు తగ్గేదిలేదని క్షిపణి ప్రయోగాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో కిమ్ తండ్రి పుట్టినరోజు వేడుకలు, ఏప్రిల్ నెలలో కిమ్ తాత పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ప్రజలకు ఆహారాన్ని గిఫ్ట్‌గా అందించేందుకు చైనా సరిహద్దులను తాత్కాలికంగా ఒపెన్ చేశారని, చైనా నుంచి ఆహార ఉత్పత్తులను భారీగా దిగుమతి చేసుకుంటున్నారని దక్షిణ కొరియా చెబుతున్నది. చైనా సరిహద్దులను తాత్కాలికంగానే ఓపెన్ చేశారా లేదంటే వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం పూర్తిగా సరిహద్దులను తెరుస్తారా అన్నది చూడాలి.