కరోనాకు పుట్టినిల్లైన చైనా జీరో వైరస్ ను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. సార్స్‌కోవ్ డీ వైరస్ వూహాన్‌లో పుట్టలేదని, ఇటలీ నుంచి వచ్చిందని కొన్నాళ్లు మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అప్పటికే ప్రపంచానికి విషయం తెలిసిపోవడంతో కామ్‌గా ఉండిపోయింది. చైనాలో వ్యాక్సినేషన్‌తో పాటు కఠిన నిబంధనలను అమలు చేస్తూ కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా మరో దేశంపై చైనా అభాండాలు వేసింది. బీజింగ్‌లో ఇటీవలే ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో చైనా అప్రమత్తం అయింది. బీజింగ్‌కు వచ్చిన ఓ పార్శిల్ ద్వారా ఒమిక్రాన్ ఎంటర్ అయిందని, కెనడా దేశం నుంచి ఆ పార్శిల్ వచ్చినట్టు బీజింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో బీజింగ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫిబ్రవరి 4 నుంచి వింటర్ ఒలింపిక్స్ జరగనున్ననేపథ్యంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. బీజింగ్‌లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.