World's Oldest Toilet: ప్రపంచంలోనే అత్యంత పురాతమైన ఫ్లషింగ్ టాయిలెట్ బయటపడింది. చైనా పురాతన శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో 2400 ఏళ్ల నాటి టాయిటెల్ వెలుగులోకి వచ్చింది. చైనాలోని జియాన్ నగరంలో ఓ పురావస్తు ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో టాయిలెట్ బాక్స్, పైపును పరిశోధకులు కనుక్కున్నారు. ఈ టాయిలెట్ యుయాంగ్ లోని ఒక ప్యాలెస్ శిథిలాల్లో కనుగొనబడింది. ఇది వారింగ్ స్టేట్స్ కాలం(424 BC), క్విన్ రాజవంశం (221 BC - 206 BC) నాటిదని పరిశోధకులు…
RUSSIA-UKRAINE WAR: ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసి ఏడాది గడుస్తున్న సందర్భంగా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని, తక్షణమే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యాను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి.
Xi Jinping: ఎట్టకేలకు చైనా ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఒప్పుకున్నాడు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయని.. ఇలాంటి సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని జిన్ పింగ్ అన్నారు.
Nikki Haley: వచ్చే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల తరుపున భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ బరిలో నిలవనున్నారు. చెప్పకనే చెబుతూ.. ఆమె అప్పుడే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రచారం ప్రారంభించినట్లయింది. ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె చైనాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్ట్ చైనా చరిత్ర బూడిద కుప్పగా ముగుస్తుందంటూ విమర్శించారు. పూర్వపు సోవియట్ యూనియన్ లాగే చైనా పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
Global Economy's Ray of Hope: చైనా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ దేశం ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి కోలుకుంటోంది. కొవిడ్ జీరో పాలసీకి డిసెంబర్లో స్వస్తి చెప్పింది. రెండు నెలల కిందట తీసుకున్న ఈ నిర్ణయం చైనాను ఆర్థికపరంగా పూర్తి స్థాయిలో కుదుటపర్చలేదు. రియల్ ఎస్టేట్, తయారీ, ఎగుమతులు, కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ వంటి రంగాలు ఇంకా బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఈ సెక్టార్లు మరింత కాలం ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
Canada: అమెరికాలో చైనీస్ స్పై బెలూన్ కలకలం రేపిన కొన్ని రోజుల్లోనే ఆకాశంలో అనుమానాస్పద వస్తువుల గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా కెనడా గగనతంలో మరో అనుమానాస్పద ఉన్న ‘అన్ ఐటెంటిఫైడ్ అబ్జెక్ట్’ను గుర్తించారు.. దీన్ని శనివారం కెనడా, అమెరికా కలిసి కూల్చేశాయి. అమెరికా ఫైటర్ జెట్లు దీన్ని కూల్చేశాయి. ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ధృవీకరించారు. యూఎస్ కు చెందిన ఎఫ్- 22 విమానం ఈ వస్తువును కూల్చేసింది. రెండు రోజుల్లో ఇది రెండో…
Sperm Donation: చైనాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. చైనా వ్యాప్తం వీర్యం కోసం పలు స్పెర్మ్ బ్యాంకులు దానం చేయాలని కోరుతున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులను డొనేట్ చేయాలని అక్కడి స్పెర్మ్ బ్యాంకులు విజ్ఞప్తి చేస్తున్నాయి. బీజింగ్, షాంఘైతో పాటు ప్రధాన నగరాల్లో ఈ ట్రెండ్ నడుస్తోంది. యూనివర్సిటీ విద్యార్థులు ఇది ఓ ఆదాయ మార్గంగా , చైనాలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును ఎదుర్కోవడానికి మార్గంగా దోహదం చేస్తుందని అక్కడి స్పెర్మ్ బ్యాంకులు భావిస్తున్నాయి.
Semiconductors : ప్రపంచంలో యుద్ధం ఇప్పుడు దేశ సరిహద్దుల్లో మాత్రమే జరగదు. ఈ కొత్త యుద్ధం ప్రస్తుతం ఆర్థిక రంగంలో ప్రారంభమైంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మార్కెట్ శక్తులను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నైపుణ్యం అనే ఆయుధాన్ని ఉపయోగించి ఈ యుద్ధం జరుగుతోంది.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ దివాళా అంచుకు చేరుకుంటోంది. కానీ ఆ దేశ సైన్యం మాత్రం ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంది. మాట మాట్లాడితే తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని భయపెడుతుంది తప్పితే.. అక్కడి ప్రజల ఆకలిని మాత్రం తీర్చలేకపోతోంది. ఉగ్రవాద దేశంగా ముద్ర పడిన పాకిస్తాన్, నానాటికి ప్రపంచంలో ఒంటరిగా మారుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తన ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా కూడా ప్రస్తుతం ముహం చాటేస్తోంది. ఇన్నాళ్లు పాకిస్తాన్ కు…