Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను ఉద్దేశించి మాట్లాడారు. యుద్ధాలను గెలవడానికి రక్షణ వనరులను మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. సైన్యాన్ని బలోపేతం చేయడానికి, యుద్ధాలను గెలవడానికి సాంకేతికత, సప్లై చైన్, జాతీయ నిల్వల వంటి రక్షణ వనరులను ఉపయోగించుకుని మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన బుధవారం అన్నారు. జిన్ పింగ్ ఈ వారంలో మూడోసారి సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షుడి హోదాకు తిరిగి ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి సైన్యం వార్షిక ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
Read Also: Lust : 31ఏళ్ల మహిళను తల్లిని చేసిన 13ఏళ్ల బాలుడు
సమీకృత వ్యూహాత్మక సామర్థాలను ఏకీకృతం చేయడం, మెరుగుపరచడం అనేది కమ్యూనిస్ట్ పార్టీ చేత నిర్ణయించబడిన కొత్త అవసరం అని ఆయన అన్నారు. చైనా సైన్యాన్ని బలోపేతం చేయడానికి, యుద్ధాలను గెలవడానికి రక్షణ శాస్త్ర, సాంకేతికతను మెరుగ్గా వినియోగించుకోవాలని సూచించారు. చైనా విదేశాలపై ఆధారపడకుండా రక్షన సాంకేతికతలో తమ పరిశోధనలను వేగవంతం చేయాలని ఆయన కోరారు. పీఎల్ఏ వందేళ్ల వేడుకలు జరిగే 2027 నాటి ప్రపంచస్థాయి ప్రమాణాలతో సైన్యాన్ని తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో చైనా, అమెరికాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తైవాన్ కేంద్రంగా ఈ రెండు దేశాలు మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంతో చైనా తమ సైన్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది.