PM Modi: ముగిసిన మోడీ జపాన్ టూర్.. చైనాకు పయనం
- ముగిసిన మోడీ జపాన్ టూర్
- చైనాకు పయనం.. 2 రోజులు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ రెండు రోజుల జపాన్ పర్యటన ముగిసింది. శుక్రవారం టోక్యో వ్యాపార వేత్తల సమావేశంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునిచ్చారు. శనివారం బుల్లెట్ ట్రైన్‌లో జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి విహరించారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చలు జరిగాయి.

Also Read
- Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
- Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
- Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
జపాన్ పర్యటన ముగియడంతో మోడీ చైనాకు బయల్దేరారు. చైనాలోని టియాంజిన్‌కు విమానంలో బయల్దేరారు. ఇక చైనాకు బయల్దేరే ముందు మోడీకి జపాన్ ప్రధాని ఇషిబా ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరవుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పుతిన్, మోడీ ఒకే వేదికపై కలవనున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్తున్నారు.
ఇది కూడా చదవండి: Hamas-Israel: అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి వీడియోను విడుదల చేసిన నెతన్యాహు.. ఎందుకోసమంటే..!
టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో మోడీ సమావేశం కానున్నారు. చైనాలో జరిగే సమ్మిట్‌కు 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఉన్నారు. ఈ సమ్మిట్‌కు ఎస్‌సీవో దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్‌మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్‌బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. చైనాలో టూర్‌లో భాగంగా తొలిసారి జిన్‌పింగ్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
#WATCH | Japan | PM Narendra Modi emplanes for Tianjin, China. He will attend the SCO Summit which will be held in Tianjin from August 31 to September 1.
(Video: DD) pic.twitter.com/LXMsqQzK0a
— ANI (@ANI) August 30, 2025
- Tags
- china
- Japan tour ends
- PM Modi
- Putin
తాజావార్తలు
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?