ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే.. ఇంట్లోకి వచ్చిన దొంగలు.. నగలు, బంగారం, డబ్బు ఇంకా ఏవైనా విలువైన వస్తువులను, ముటా ముళ్లే.. కట్టేసి చెక్కేస్తారు. కానీ చైనాలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఈ విషయం అక్కడ సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చైనాలోని యాంగ్జౌ ప్రాంతంలో ఉండే ఓ మహిళ ఇంట్లోకి లీ అనే దొంగ చొరబడ్డాడు. దొంగ దొంగతనం చేస్తే పర్వాలేదు. ఏకంగా మహిళ రక్తం చోరీ చేసేందుకు యత్నించాడు. మహిళ భర్త ఇంట్లో లేని టైంలో వచ్చిన దొంగ మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమె రక్తాన్ని తీయడం ప్రారంభించాడు. కొద్ధి సేపటి తర్వాత.. మహిళ భర్త రావడంతో లీ అక్కడి నుంచి జారుకున్నాడు.
అనంతరం మహిళ భర్త మాట్లాడుతూ.. తాను ఇంట్లో లేని టైంలో తన ఇంట్లోకి ప్రవేశించి.. తన భార్య రక్తాన్ని కాజేయాలని ప్రయత్నించాడని మీడియాతో తెలిపాడు. దీంతో ఈ విషయం కాస్త వైరల్ అయ్యింది.
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతడు విస్తుపోయే విషయాలను వెల్లడించాడు. ప్రజల ఇళ్లలోకి చోరబడం అంటే తనకు ఎంతో ఇష్టమని.. దీన్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. అతడి వ్యాఖ్యలు విన్న నెటిజన్లు భయాందోళనకు గురయ్యారు. నిందితుడికి గతంలో దొంగతనం, అత్యాచారం వంటి కేసుల్లో దోషిగా ఉన్నాడు. ఈ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది కోర్ట్…