Trump: సుంకాలపై ట్రంప్ పక్షపాతం.. చైనాకు ఏం చేశారంటే..!
- సుంకాలపై ట్రంప్ పక్షపాతం
- చైనా విషయంలో యూటర్న్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాతో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు భారీ జరిమానాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే భారత్‌పై అదనంగా 25 శాతం సుంకం విధించారు. ఇదే కోవలో చైనా కూడా ఉంది. రష్యా దగ్గర చైనా కూడా చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనా విషయంలో మాత్రం పక్షపాతం చూపించారు. చైనాకు విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపినట్లు కథనం వెలువడింది.
పరస్పర సుంకాలపై గత నెలలో స్టాక్‌హోమ్‌లో అమెరికా-చైనా అధికారుల మధ్య వాణిజ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో చైనాపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేసినట్లు నివేదికలు అందుతున్నాయి.
Also Read
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- 43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
- Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఇది కూడా చదవండి: Bilawal Bhutto: సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే భారత్ తో యుద్ధమే..
అయితే చైనాతో అమెరికా మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు విధించిన సుంకాల విషయంలో అగ్ర రాజ్యం వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇక ఇదే విషయంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ మాట్లాడుతూ.. చైనాపై ప్రతీకార సుంకాలు విధించాలా? వద్దా? అన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. సుంకాల విషయంలో చైనా సమస్య కొంచెం సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలుతో ముడి పెట్టలేని అనేక ఇతర అంశాలు అమెరికా-చైనా సంబంధాలను ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌కు విధించినట్టుగా చైనాకు కూడా జరిమానా విధిస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు జేడీవాన్స్ పైవిధంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: Sridevi : ‘కోర్టు’ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి..! వీడియో వైరల్
తొలుత భారతదేశంపై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానా కింద అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తు్న్నట్లు బాంబ్ పేల్చారు. ఇప్పుడు భారత్ 50 శాతం సుంకం చెల్లించాల్సి వస్తుంది. కొత్తగా విధించింది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. అయితే భారత్ కొనుగోలు చేస్తున్నట్లుగా చైనా కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనాకు మాత్రం జరిమానా విధించలేదు. దీంతో ఇదేం పక్షపాతం అంటూ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!