చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో ఉగ్రవాదంపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఉగ్రవాదంపై కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని.. దీంతో మానవాళి మనుగడకు ప్రమాదమని ప్రధాని మోడీ హెచ్చరించారు.
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి తిరిగారు. అంతేకాకుండా చాలా కులాసాగా మాట్లాడుకున్నారు. నవ్వుతూ.. ఉల్లాసంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు ప్రపంచానికి ఒక హెచ్చరికగా వెళ్లాయి.
చైనాలో రెండు రోజుల పాటు షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మెడీ.. ఇలా ఆయా దేశాధినేతలంతా హాజరయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో చైనాలో అడుగుపెట్టారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు మాత్రం తాజాగా వెరైటీగా అడుగుపెట్టారు.
చైనా వేదికగా టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా ఆయా దేశాల ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు.
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదని.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. చైనాలోని టియాంజిన్ వేదికగా జరుగుతున్న ఎస్సీవో శిగ్రరాగ్ర సమావేశంలో మోడీ ప్రసంగించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని మోడీ ప్రస్తావించారు.
చైనా వేదికగా జరుగుతున్న ఎస్సీవో సమావేశంలో పాక్ ప్రధానికి ప్రధాని మోడీ బిగ్ షాక్ ఇచ్చారు. కనీసం ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్, జిన్‌పింగ్ సంభాషించుకున్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను మోడీ ఆత్మీయంగా పలకించారు.
ప్రధాని మోడీ రెండు రోజుల జపాన్ పర్యటన ముగిసింది. శుక్రవారం టోక్యో వ్యాపార వేత్తల సమావేశంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునిచ్చారు. శనివారం బుల్లెట్ ట్రైన్లో జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి విహరించారు.
ప్రధాని మోడీ జపాన్ చేరుకున్నారు. టోక్యో చేరుకోగానే ఎయిర్‌పోర్టులో మోడీకి ఘనస్వాగతం లభించింది. జపాన్, చైనా పర్యటన కోసం మోడీ గురువారం బయల్దేరి వెళ్లారు. శుక్ర, శనివారం పర్యటనలో భాగంగా 15వ భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే.. ఇంట్లోకి వచ్చిన దొంగలు.. నగలు, బంగారం, డబ్బు ఇంకా ఏవైనా విలువైన వస్తువులను, ముటా ముళ్లే.. కట్టేసి చెక్కేస్తారు. కానీ చైనాలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఈ విషయం అక్కడ సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని యాంగ్జౌ ప్రాంతంలో ఉండే ఓ మహిళ ఇంట్లోకి లీ అనే దొంగ చొరబడ్డాడు. దొంగ దొంగతనం చేస్తే పర్వాలేదు. ఏకంగా మహిళ…