Indian Economy: 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో పరుగుతీస్తోంది. ప్రస్తుతం ఈ దేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2075 నాటికి ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇది మాత్రమే కాదు.. ఇది జపాన్, జర్మనీతో పాటు అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాను వెనక్కినెట్టనుంది. గోల్డ్‌మన్ సాక్స్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో 2100 నాటికి భారతదేశ జనాభా ప్రపంచంలోని అన్ని దేశాలను అధిగమిస్తుందని పేర్కొంది. ఇక్కడ జనాభా 1,529 మిలియన్ల వరకు ఉంటుంది. దీనితో పాటు భారతదేశ జిడిపి కూడా వేగంగా పెరుగుతుందని అంచనా. దీని తరువాత చైనా జనాభా అత్యధికంగా 767 మిలియన్లుగా అంచనా వేయబడింది. వీటి తర్వాత నైజీరియా జనాభా 546 మిలియన్లు, పాకిస్తాన్ 487 మిలియన్లు, కాంగో 432 మిలియన్లకు చేరుకుంటుంది.
Read Also:Viral Catch Video: అరె.. ఏంట్రా ఆ క్యాచ్! మస్త్ పట్టినవ్ పో
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
2075లో టాప్-5 ఆర్థిక వ్యవస్థ దేశాలు
2075 సంవత్సరంలో భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. దీని ఆర్థిక వ్యవస్థ 52.5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఆ దేశ విలువ 57 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 51.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా అవుతుంది. దీని తరువాత యూరో ఏరియా, జపాన్ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది.
ఇది ఇలా ఉంటే రాబోయే రెండు దశాబ్దాల్లో ఇతర ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్పంగా ఉంటుందని గోల్డ్‌మన్ సాక్స్ రీసెర్చ్‌లో భారత ఆర్థికవేత్త శంతను సేన్‌గుప్తా అన్నారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా శ్రామిక శక్తి సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. నిపుణులు రాబోయే 20ఏళ్లలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్పంగా ఉంటుందని అంటున్నారు. భారత్‌కు తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం, సేవలను పెంచడం, మౌలిక సదుపాయాల వృద్ధిని కొనసాగించడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశానికి ఆవిష్కరణలు, కార్మికుల ఉత్పాదకత పెరగడం ప్రత్యేకమని గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా పెంచేందుకు ఇది దోహదపడుతుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!