Xi Jinping: సెప్టెంబర్ 9-10 తేదీల్లో భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పుతిన్ ఇండియాకు రావడం లేదు. అయితే జిన్ పింగ్ ఎలాంటి కారణాలు లేకుండా జీ20 సదస్సుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అతని స్థానంలో ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతున్నారు. కాగా.. అతను ఇండియాకు రాకపోవడానికి ప్రధానంగా 5 కారణాలు ఉండొచ్చని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
1) ఇటీవల చైనా ప్రామాణిక మ్యాపుల పేరుతో ఆ దేశ మ్యాపుల్ని రిలీజ్ చేసింది. దీంట్లో భారత్ కి చెందిన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలను తమవిగా చూపించింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెందు దేశాల మధ్య మరోసారి దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. కేవలం జీ20 సమావేశాలకు కొన్ని రోజుల ముందే ఈ మ్యాపులను చైనా రిలీజ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2) సరిహద్దు వివాదం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మూడేళ్ల క్రితం గాల్వాన్ లోయ ఘటన తర్వాత ఇరు దేశాలు సరిహద్దుల్లో వేలల్లో బలగాలను, విమానాలను మోహరించాయి. గాల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటన తర్వాత పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్, చైనా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి.
Read Also: Arvind Kejriwal: ఇండియా కూటమి భయంతోనే “భారత్” .. తర్వాత భారత్ పేరును బీజేపీగా మారుస్తుందా..?
3) చైనాకు ప్రత్యర్థిగా ఉన్న అమెరికాతో భారత్ ఇటీవల కాలంలో సంబంధాలు బాగా మెరుగుపరుచుకుంటోంది. సైనికంగా, వ్యూహాత్మకంగా ఇరు దేశాలు ఒకరికిఒకరు సహకరించుకుంటున్నాయి. ఇది కూడా ఒక కారణమై ఉంటుంది.
4) ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీలోని రాజకీయ శాస్త్రవేత్త వెన్-టి సంగ్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. జీ 20 వెస్ట్రన్ దేశాలు ఎక్కువగా ఉన్న కూటమి. అయితే ఇటీవల కాలంలో వెస్ట్రన్ దేశాలకు వ్యతిరేకంగా రష్యా, చైనాలు నిలవాలని అనుకుంటున్నాయి. పుతిన్ ఎలాగూ ఈ సమావేశానికి హాజరుకావడం లేదు కాబట్టి ఆయనకు సంఘీభావంగా జిన్ పింగ్ కూడా ఈ సమావేశాల్ని దాటవేసినట్లు తెలుస్తోందని అననారు.
5) నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ వు మాట్లాడుతూ.. జిన్ పింగ్ దేశీయంగా ఉన్న సమస్యపై దృష్టిలో ఉంచుకుని విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం పోవచ్చని, జిన్ పింగ్ తన సొంత ఎజెండాను ఏర్పాటు చేసుకుంటున్నాడని, అతని ప్రధాన ఆందోళన జాతీయ భద్రత అని, చైనాలోనే ఉండీ, ఇతర విదేశీ నాయకులు చైనాను సందర్శించేలా చేయాలని అనుకుంటున్నాడని చెప్పారు. య