G20 Summit 2023: జీ20 సదస్సు ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. విదేశీ గడ్డ నుండి వచ్చే ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం భూ ఉపరితలం, ఆన్లైన్లో భద్రతా చర్యలను పెంచింది.
China: భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో అగ్రదేశాల అధినేతలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే భారతదేశానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న పలుకుబడిని చూసి డ్రాగన్ కంట్రీ చైనా తట్టుకోలేకపోతోంది. చైనా తన మౌత్పీస్ పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ ద్వారా భారతదేశంపై విషాన్ని చిమ్మే కథనాలను ప్రచురిస్తోంది. భారతదేశం అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకునేందకు జీ20 సదస్సును ఉపయోగించుకుంటుందని వ్యాఖ్యానించింది.
China: డ్రాగన్ కంట్రీలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మానవహక్కులకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిందే చట్టం, చెప్పందే వేదం. దేశాన్ని విమర్శించినా, కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన ప్రజలు మాయమవుతుంటారు. లేకపోతే జైళ్లలోకి వెళ్తుంటారు. అలాంటి చైనా కొత్తగా మరో చట్టాన్ని తీసుకురాబోతోంది.
సాధారణంగా చైనా ప్రొడక్ట్స్ గురించి ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. అదే తరహాలో చైనాకు కూడా భద్రతాపరమైన భయం పట్టుకుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని చైనా తమ ఉద్యోగులకు సూచించినట్లు తెలుస్తోంది.
Maldives: హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు. ఈ చిన్న దేశం ఇప్పుడు ఆసియా శక్తులుగా ఉన్న ఇండియా, చైనాలకు కీలకంగా మారింది. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఇండియా, చైనాలు పోటీ పడుతున్నాయా.? అనే విధంగా అక్కడి పరిస్థితి ఉంది. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు ఈ రెండు దేశాలకు కీలకంగా మారాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వం భారత్ పక్షాన ఉంది. ఈ ప్రాంత భౌగోళిక స్థితి రెండు దేశాలకు కీలకంగా మారింది.
Great Wall of China: ఓ ఇద్దరు షార్ట్ కట్ రూట్ కోసం చేసిన పని చైనాకు పెద్ద డ్యామేజ్ చేసింది. కేవలం త్వరగా వెళ్లడం కోసం వారు ఏకంగా చైనా వాల్ కే కన్నం పెట్టేశారు. చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్లోని యుయు కౌంటీ వద్ద ఉన్న యాంగ్కాన్హె టౌన్షిప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎవరైనా షాట్ కట్ కోసం మహా అయితే డివైడర్ లను పక్కకి తొలగించి వెళ్లడం మనం చూసుంటం.అయితే ఇక్కడ…
Xi Jinping: సెప్టెంబర్ 9-10 తేదీల్లో భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పుతిన్ ఇండియాకు రావడం లేదు. అతని స్థానంలో ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతున్నారు.
ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సమ్మిట్ ఏకాభిప్రాయాన్ని ఏర్పరుస్తుందని, విశ్వాస సందేశాన్ని పంపుతుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు.
హైకూయ్ తుపాను మంగళవారం చైనాలోని ఆగ్నేయ తీరం వెంబడి తీరం దాటే అవకాశం ఉన్నందున అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని పాఠశాలలు నిలిపివేయబడ్డాయి. ఈ మేరకు చైనా ఆధారిత గ్లోబల్ టైమ్స్ నివేదించింది.