China: చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన షుంటియన్ కెమికల్ గ్రూప్ అనే కంపెనీ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుని దేశ ఉన్నత అధికారులు నుండి కఠినమైన హెచ్చరికలు అందుకుంది. ఈ కంపెనీ రాబోయే సెప్టెంబర్ నెల లోపల పెళ్లి చేసుకోని ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించగా.. దానితో ఆ విషయం కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కంపెనీ ఒక వివాదాస్పద విధానాన్ని (policy) ప్రవేశపెట్టింది. 28 నుండి 58 సంవత్సరాల వయస్సు ఉన్న అవివాహితులు, విడాకులు పొందిన…
Corona Virus: కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ మాదిరిగానే జంతువుల నుంచి మానవుడికి వ్యాపించే ప్రమాదం కలిగి ఉన్న కొత్త వైరస్ చైనా పరిశోధకులు గుర్తించారు. గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు చేసిన కారణంగా ‘‘బ్యాట్ ఉమెన్’’గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ, గ్వాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్స్, వూహాన్ యూనివర్సిటీ అండ్ వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు
Toilet Usage Management Rule: ఆఫీస్ లలో పనిచేసేవారు ఎన్నో కొత్త కొత్త రూల్స్ వినడం వాటిని ఆచరించడం పరిపాటే. అయితే, తాజాగా చైనా దక్షిణ ప్రాంతంలోని ఒక కంపెనీ ఉద్యోగుల మరుగుదొడ్ల వినియోగంపై కఠిన నియమాలను అమలు చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఫోషాన్ లో ఉన్న ‘త్రీ బ్రదర్స్ మెషిన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ’ ఫిబ్రవరి 11 నుంచి కొత్త టాయిలెట్ యూజేజ్ మేనేజ్మెంట్ రూల్ అమలు చేసింది.…
Sam Pitroda: కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శ్యామ్ పిట్రోడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల భారతదేశం యొక్క విధానం ఘర్షణాత్మకమైనదని, ఆ మనస్తత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్రాగన్ కంట్రీ నుంచి వచ్చే ముప్పు ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు.
China: చైనాలో వివాహాల సంఖ్య క్షీణించడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దీని ఫలితంగా జననాల రేటు కూడా తగ్గుతోంది. ఫలితంగా ఇది వృద్ధుల సంఖ్యను పెంచుతోంది. గత సంవత్సరం వివాహాలలో రికార్డు స్థాయిలో తగ్గుదల కనిపించింది. దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివాహ నమోదులలో 20% క్షీణత నమోదైందని,
Chinese ship: భారత్‌కి చైనా నుంచి భద్రతపరమైన సమస్యలు తప్పడం లేదు. తాజాగా చైనాకు చెందిన నౌకలు, ఇండియాకు సమీపంలో అరేబియా సముద్రంలో కనిపించాయి. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీలమైన సముద్రం నిఘాను సేకరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, చైనా మాత్రం ‘‘మత్స్య పరిశోధన’’ కోసమని చెబుతోంది. రెండు నౌకలు లాన్ హై 101 , 201 అరేబియా సముద్రంలో పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్( OSINT) నిపుణుడు డామియన్ సైమన్…
Donlad Trump: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేశాడు. మంగళవారం నుంచి పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం, ట్రంప్ చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం, మెక్సికో, కెనడా నుండి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు
China: చైనా అన్ని రంగాల్లో అమెరికాకు సవాల్ విసురుతోంది. ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ, టెక్నాలజీలో అమెరికాను మించి ఎదగాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కార్యాచరణ వేగాన్ని పెంచింది. యూఎస్‌ని కాదని అగ్రరాజ్య హోదా తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా ఏఐ చాట్‌బాట్ ‘‘డీప్ సీక్’’ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చుక్కలు చూపించింది.
DeepSeek: అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మార్కెట్‌ని చైనా ఏఐ టూల్ ‘‘డీప్ సీక్’’ షేక్ చేసింది. డీప్ సీక్ దెబ్బకు చాట్‌జీపీటీ వంటి దిగ్గజం కూడా ఆందోళన చెందింది. ప్రస్తుతం ఏఐ పరిశ్రమలో తిరుగులేకుండా ఉన్న అమెరికాకు చైనా ధీటుగా బదులిచ్చింది.