Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్ భారత్‌ని ఏదో రకంగా విసిగిస్తూనే ఉంది. కొత్త పాలకుడు మహ్మద్ యూనస్ భారత్ టార్గెట్‌గా గేమ్స్ ఆడుతున్నాడు. దీనికి తోడు ఆయనకు మద్దతు ఇస్తున్న మతోన్మాద సంస్థలు జమాతే ఇస్లామీ, బీఎన్‌పీ వంటి పార్టీలు భారత్ వ్యతిరేక ధోరణిని అవలంభిస్తున్నాయి. ఇదిలా ఉంటే, యూనస్ పాకిస్తాన్, చైనాకలు పెద్దపీట వేస్తున్నాడు.
భారతదేశంలో అత్యంత కీలమైన హసిమారా వైమానిక స్థావరం సమీపంలోకి వచ్చేందుకు పాకిస్తాన్‌కి అనుమతి ఇచ్చాడు. హసినామా భారత్‌కి అత్యంత కీలకమైన ‘‘చికెన్స్ నెక్’’ ప్రాంతంలో ఉంటుంది. ఇది వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. హసిమారా నుంచి 120 కి.మీ దూరంలో పాకిస్తాన్ చేరుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఇదే కాకుండా బంగ్లాదేశ్ వైమానిక దళ అధికారులు JF-17 యుద్ధ విమానాలపై శిక్షణ పొందడానికి పాకిస్తాన్‌కు వెళ్తున్నారు. ఈ విమానాన్ని పాక్, చైనాలు సంయుక్తంగా డెవలప్ చేశాయి. ఈ పరిణామాలు అన్నీ కూడా భారత్‌కి ఇబ్బంది కలిగించేవే.
Read Also: SRH vs GT: ఈసారైనా గెలుస్తారా? టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
మరోవైపు మోంగ్లా నౌకాశ్రయాన్ని అప్‌గ్రేడ్ చేసే పనిని చైనాకు అప్పగించారు. చైనాకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్‌లోని మోంగ్లా ఓడరేవు కోల్‌కతా నుంచి కేవలం 180 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చాలా ఏళ్లుగా హిందూ మహా సముద్రంపై పట్టు సాధించేందుకు, భారత ఆధిపత్యానికి గండి కొట్టేందుకు చైనా ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు చైనాకు బంగ్లాదేశ్ సహకరిస్తోంది.
భారత్ ప్రధాన భూభాగాలను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఇరుకైన కారిడార్ ‘‘సిలిగురి కారిడార్ లేదా చికెన్స్ నెక్’’పై బంగ్లాదేశ్ దాని కొత్త మిత్రులు పాక్, చైనాలు కుట్రలు పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. మన హసినామా ఎయిర్ బేస్ నుంచి కేవలం 120 కి.మీ దూరంలోని బంగ్లాదేశ్ లాల్మోనిర్హాట్ వైమానికి స్థానవరంలో JF-17 యుద్ధ విమానాలను మోహరిస్తోంది. బంగ్లా వైమానిక స్థావరంలో పాక్ ఉనికి కూడా భారత్‌కి ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో భారత్ టార్గెట్‌గా బంగ్లాదేశ్ పాక్, చైనాకు ఆట స్థలంగా మారింది. యూనస్ మెడలు వంచేలా భారత్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది.