Donald Trump: ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటకు వచ్చిన అమెరికా, మరోసారి ఆ దేశానికి వెళ్లాలని యోచిస్తోంది. ‘‘జో బైడెన్ వదులుకున్నాడు, మనం దానిని తిరిగి పొందాలని నేను అనుకుంటున్నారు’’ అని ట్రంప్ అన్నారు. అమెరికా వ్యూహాత్మకంగా భావిస్తున్న ఆఫ్ఘాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరం గురించి ట్రంప్ మాట్లాడారు. అమెరికా సాయుధ దళాల కమాండర్ అండ్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం తర్వాత, ఆయన విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నన్ను చాలా బాధపెట్టిన విషయం ఏమిటంటే, మేము ఆఫ్ఘనిస్తాన్‌కు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇచ్చాము, ఎవరికీ తెలియదు, అయినప్పటికీ, మేము ఆ పరికరాలన్నింటినీ వదిలిపెట్టాము, ఆ సమయంలో నేను అధ్యక్షుడిని అయితే ఇది జరిగేది కాదు’’ అని అన్నారు. నా అధ్యక్ష సమయంలో అక్కడ నుంచి వచ్చేశాం. అమెరికా సైనిక ఉనికిని 5000 కంటే తక్కువగా చేర్చింది నేనే. కానీ మేము బగ్రామ్ ఏయిర్ బేస్ ను ఉంచబోతున్నాము. దీనికి ఆఫ్ఘనిస్తాన్ కారణం కాదు. దీనికి కారణం చైనా. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ నుంచి గంట దూరంలోనే చైనా అణు క్షిపణులు తయారు చేసే ప్రదేశం ఉంది. కాబట్టి మేము బాగ్రామ్ వెళ్లబోతున్నాము’’ అని ట్రంప్ అన్నారు.
READ ALSO: Donald Trump: ఇంగ్లీష్‌ని అమెరికాలో అధికార భాష చేయనున్న ట్రంప్..
‘‘బాగ్రామ్ ఎయిర్‌బేస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌బేస్‌లలో ఒకటి. దీనికి అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన రన్‌వేలు ఉన్నాయి. దానిని బలోపేతం చేయడానికి చాలా బరువైన కాంక్రీటు మరియు ఉక్కును ఉపయోగించారు. దానిపై ఏదైనా తీసుకెళ్లవచ్చు. మరియు మేము దానిని వదులుకున్నాము. ప్రస్తుతం దానిని చైనా ఆక్రమించింది. ఎందుకంటే బైడెన్ దానిని వదులుకున్నారు. కానీ మేము దానిని మళ్లీ తీసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు.
అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో ముఖ్యంగా బాగ్రామ్ ఎయిర్ బేస్‌లో చిన్న సైన్యాన్ని ఉంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘన్ తాలిబాన్ల పాలనలో ఉంది. అమెరికా ఆఫ్ఘన్‌ని వదిలి వచ్చేటప్పుడు సుమారుగా 40,000 సాయుధ, సైనిక భారీ వాహనాలను వదిలిపెట్టి వచ్చినట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా ఇలా వదిలి రావడాన్ని అవమానకరమైనదిగా ట్రంప్ అభివర్ణించారు. అమెరిక పంపిస్తున్న బిలియన్ డాలర్ల సాయంతోనే ఆఫ్ఘాన్ బతుకుతోందని చెప్పారు.