అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కూడా యూఎస్‌కు తగిన సమాధానం ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ అదనపు టారిఫ్ ఏప్రిల్ 12 నుంచి వర్తిస్తుంది. ఏప్రిల్ 12 నుంచి చైనాలో అమెరికన్ ఉత్పత్తులపై సుంకం 84 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ…
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. రెండు అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య టిట్-ఫర్-టాట్ టారిఫ్ వార్ కొనసాగుతుంది.. ఇకపై ఏదీ పూర్తిగా వ్యాపారం కాదు.. ప్రతిదీ కూడా వ్యక్తిగతమైనదని అన్నారు.
Trump Tariff: చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఇక, అగ్ర రాజ్యంతో ఢీ అంటే ఢీ అంటున్న డ్రాగన్‌పై సుంకాలు పెంచేస్తుంది. ఇప్పటిదాకా చైనాపై విధించిన టారిఫ్ లను మొత్తంగా లెక్కిస్తే 145 శాతంగా ఉంటాయని యూఎస్ స్పష్టం చేసింది.
US-China Trade War: చైనా దిగుమతులపై 125 శాతం పన్నులను అగ్రరాజ్యం అమెరికా విధించింది. ఈ టారిఫ్‌లపై బీజింగ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాము చైనీయులం.. కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొన్నారు.
US-EU Trade War: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర టారిఫ్ లు విధించారు. ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు- అల్యూమినియంపై సుమారు 25 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ అన్ని దేశాలపై పరస్పర సుంకాలను సుమారు 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఈ మూడు నెలల పాటు కనీసం 10 శాతం పన్నులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సతమతం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ మరోసారి చైనాకు బిగ్ షాకిచ్చారు.
Piyush Goyal: చైనాపై మరోసారి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించారు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను ఉపయోగించి చైనా ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని ఆరోపించారు.
US-China Trade War: చైనా - అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. పన్నుల విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్‌కు తాము భయపడబోమని డ్రాగన్ కంట్రీ స్పష్టం చేసింది.