Chinese ship: భారత్‌కి చైనా నుంచి భద్రతపరమైన సమస్యలు తప్పడం లేదు. తాజాగా చైనాకు చెందిన నౌకలు, ఇండియాకు సమీపంలో అరేబియా సముద్రంలో కనిపించాయి. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీలమైన సముద్రం నిఘాను సేకరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, చైనా మాత్రం ‘‘మత్స్య పరిశోధన’’ కోసమని చెబుతోంది. రెండు నౌకలు లాన్ హై 101 , 201 అరేబియా సముద్రంలో పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్( OSINT) నిపుణుడు డామియన్ సైమన్…
Donlad Trump: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేశాడు. మంగళవారం నుంచి పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం, ట్రంప్ చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం, మెక్సికో, కెనడా నుండి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు
China: చైనా అన్ని రంగాల్లో అమెరికాకు సవాల్ విసురుతోంది. ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ, టెక్నాలజీలో అమెరికాను మించి ఎదగాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కార్యాచరణ వేగాన్ని పెంచింది. యూఎస్‌ని కాదని అగ్రరాజ్య హోదా తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా ఏఐ చాట్‌బాట్ ‘‘డీప్ సీక్’’ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చుక్కలు చూపించింది.
DeepSeek: అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మార్కెట్‌ని చైనా ఏఐ టూల్ ‘‘డీప్ సీక్’’ షేక్ చేసింది. డీప్ సీక్ దెబ్బకు చాట్‌జీపీటీ వంటి దిగ్గజం కూడా ఆందోళన చెందింది. ప్రస్తుతం ఏఐ పరిశ్రమలో తిరుగులేకుండా ఉన్న అమెరికాకు చైనా ధీటుగా బదులిచ్చింది.
Bumper Offer: చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ మరోసారి తన ఉద్యోగులకు అద్భుతమైన బోనస్ ఆఫర్ ప్రకటించింది. తమ కంపెనీ ఉద్యోగులకు మొత్తంగా రూ.70 కోట్లు వార్షిక బోనస్‌గా అందజేసింది. అయితే, ఈ బోనస్‌ను ఇచ్చే విధానం చాలా ఆసక్తికరంగా నిర్వహించింది కంపెనీ యాజమాన్యం. ఇందుకోసం కాస్త భారీగానే ఏర్పాట్లు కూడా చేసారు. Also Read: BSNL: వినియోగదారులకు షాక్.. సూపర్ హిట్ ప్లాన్స్‌ను తర్వలో నిలిపేయనున్న బిఎస్ఎన్ఎల్ ఇక ఈ మొత్తాన్ని పంపకం…
China : చైనా తన సాంకేతికత, అనేక రంగాలలో కొత్త ప్రయోగాల ద్వారా ఏ పాశ్చాత్య దేశానికన్నా తక్కువ కాదని నిరూపించుకుంది. చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేసింది.
ఇదిలా ఉంటే, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ గురించి అడిగిన ప్రశ్నకు చైనా డీప్ సీక్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని పలుమార్లు చైనా క్లెయిమ్ చేసింది. ఇది దక్షిణ టిబెట్‌లో అంతర్భాంగంగా డ్రాగన్ కంట్రీ పేర్కొంటోంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక నిర్ధిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి చైనీస్ చాట్‌బాట్ నిరాకరించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
Kailash Mansarovar Yatra: భారత, చైనాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు రోజలు పాటు విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు జరిగాయి. దీనిలో వేసవిలో కైలాస్-మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ప్రస్తుత ఒప్పందాల ప్రకారం.. దీనికి సంబంధించిన విధానాలను సంబంధిత యంత్రాంగం చర్చిస్తోందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ప్రారంభించాలని సూత్రప్రాయ ఒప్పందం కుదిరింది. Read Also: Nandamuri Balakrishna: బాలకృష్ణని…
China: చైనాలోని శాంఘైకు పశ్చిమంగా ఉన్న జిన్‌కి పట్టణంలో ఒక వృద్ధుడు హువాంగ్ పింగ్ తన రెండు అంతస్తుల ఇంట్లో జీవిస్తున్నాడు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదిత పరిహారం తీసుకోకుండా ఒక రహదారి మధ్యలో తన సొంత ఇంటిలో జీవిస్తున్నాడు. నిజానికి ఆ వృద్ధుడు తనతో పాటు ఉంటున్న 11 నెలల మనవడు నివసిస్తున్న ఇంటి దగ్గర నేషనల్ హైవే నిర్మిస్తున్న కారణంగా దానిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు పరిహారంగా పువాంగుకు ఏకంగా 1.6 మిలియన్ CNY…