అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సతమతం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ మరోసారి చైనాకు బిగ్ షాకిచ్చారు.
Piyush Goyal: చైనాపై మరోసారి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించారు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను ఉపయోగించి చైనా ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని ఆరోపించారు.
US-China Trade War: చైనా - అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. పన్నుల విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్‌కు తాము భయపడబోమని డ్రాగన్ కంట్రీ స్పష్టం చేసింది.
Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్ భారత్‌ని ఏదో రకంగా విసిగిస్తూనే ఉంది. కొత్త పాలకుడు మహ్మద్ యూనస్ భారత్ టార్గెట్‌గా గేమ్స్ ఆడుతున్నాడు. దీనికి తోడు ఆయనకు మద్దతు ఇస్తున్న మతోన్మాద సంస్థలు జమాతే ఇస్లామీ, బీఎన్పీ వంటి పార్టీలు భారత్ వ్యతిరేక ధోరణిని అవలంభిస్తున్నాయి. ఇదిలా ఉంటే, యూనస్ పాకిస్తాన్, చైనాకలు పెద్దపీట వేస్తున్నాడు.
Northeast: బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ తన చైనా పర్యటనలో ‘‘ఈశాన్య రాష్ట్రాల’’ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చైనాను బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తూనే, భారతదేశానికి చెందిన ఏడు సిస్టర్ స్టేట్స్(ఈశాన్య రాష్ట్రాలు) ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని,
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ చైనా పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే, పాకిస్తాన్‌తో స్నేహం చేస్తున్న బంగ్లాదేశ్, ఇప్పుడు చైనాతో చెలిమిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ భారత్‌ని బెదిరించేలా చైనాలో కామెంట్స్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
China: ఇంటి అద్దెను ఆదా చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా కంపెనీ టాయిలెట్‌ని మకాంగా మార్చుకుంది. చైనాకు చెందిన 18 ఏళ్ల యువతి యాంగ్, తన పనిచేస్తున్న ఫర్నీచర్ దుకాణంలోని టాయిలెట్‌ని నివాసంగా చేసుకుంది. దీనికి నెలకు 5 యువాన్లు (రూ. 545) అద్దె చెల్లిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె నెలకు దాదాపుగా రూ. 34,570 సంపాదిస్తుంది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆదా చేయడానికి ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారీ భూకంపాలతో హడలెత్తిపోయాయి. ఈ ఉదయం బ్యాంకాక్, మయన్మార్‌లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో భారీ అంతస్తుల బిల్డింగ్లు నేలకూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్ ను పోల్చమని యూఎస్ తెలిపింది. భారత్- అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూఎస్‌కు చెందిన వాణిజ్య శాఖ అధికారులు, ఢిల్లీలోని అధికారులతో చర్చల సమయంలో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
America-China: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల చైనా దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడంతో చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా యుద్ధమే కోరుకుంటే తాము చివరి వరకూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చైనా హెచ్చరించింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించారు. కానీ, ఇప్పుడు ఆ సుంకాలను 20 శాతం చేసిన తర్వాత చైనా ప్రతిస్పందించింది. Read Also: Graduate MLC Elections: పట్టభద్రుల…