Trump Tariff: చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఇక, అగ్ర రాజ్యంతో ఢీ అంటే ఢీ అంటున్న డ్రాగన్‌పై సుంకాలు పెంచేస్తుంది. ఇప్పటిదాకా చైనాపై విధించిన టారిఫ్ లను మొత్తంగా లెక్కిస్తే 145 శాతంగా ఉంటాయని యూఎస్ స్పష్టం చేసింది. అయితే, బుధవారం నాటికి 125 శాతమని ట్రంప్ పేర్కొనగా.. అది గురువారం వరకు 145 శాతానికి పెంచినట్లు వైట్ హౌస్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, భారత్‌పై విధించిన 26 శాతం అదనపు సుంకాల మినహాయింపు జులై 9వ తేదీ వరకూ అమల్లో ఉంటుందని వెల్లడించింది. గతంలో అమల్లో ఉన్న 10 శాతం సుంకాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చింది. అలాగే, చైనాపై మరింతగా పన్నులు పెరగడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి.
Read Also: US: న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
కాగా, సుంకాల వాయిదాకు తెచ్చిన 14,257 కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం పెట్టారు. దీనివల్ల 75కు పైగా దేశాలకు 90 రోజుల పాటు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. చైనా, హాంకాంగ్, మకావులకు మాత్రం ఇది వర్తించదు అని పేర్కొన్నారు. అయితే, పన్నులపై అమెరికాతో వివాదానికి దిగుతున్న చైనా కాస్త వెనక్కి తగ్గిపోయింది. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గబోమంటూనే చర్చలకు రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అమెరికా విధించిన 145శాతం సుంకాలకు నిరసనగా ఫిల్మ్‌ల దిగుమతులను తగ్గించింది. యూఎస్ సుంకాల యుద్ధమే చేయాలనుకుంటే.. చివరి వరకు తామూ పోరాడుతామని చైనా వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి యాంగ్ కి యాన్ వెల్లడించాడు. చైనాతో డీల్ చేయాలంటే.. ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు సరైన మార్గం కాదని పేర్కొన్నారు. ఇరు దేశాలు కలిసి కూర్చొని విభేదాల పరిష్కారానికి కృషి చేస్తామని చైనా చెప్పుకొచ్చింది.
Read Also: Nagar Kurnool: నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం..
ఇక డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలతో 438 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై ఎఫెక్ట్ పడనుంది. డ్రాగన్ కంట్రీ విధించిన 84 శాతం టారిఫ్ ల వల్ల 143 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై ప్రభావం చూపిస్తుంది. అమెరికా విధించిన సుంకాలపై చైనా ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకున్నాయి. యూఎస్ కు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయని నెట్టంట పోస్టులు వెలువడుతున్నాయి.