US-China Trade War: చైనా దిగుమతులపై 125 శాతం పన్నులను అగ్రరాజ్యం అమెరికా విధించింది. ఈ టారిఫ్‌లపై బీజింగ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాము చైనీయులం.. కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొన్నారు. సుంకాల విషయంలో వెనక్కి తగ్గమని చెప్పుకొచ్చారు. దీనికి ఆమె 1953లో అమెరికా- చైనాల మధ్య యుద్ధం నేపథ్యంలో చైనా నాయకుడు మావో జెడాంగ్ ప్రసంగించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో తాము నిర్ణయించలేం.. అది అమెరికా ఇష్టం.. ఇది ఎంతకాలం జరిగినామేము వెనక్కి తగ్గం.. పూర్తిగా విజయం సాధించే వరకు పోరాటం చేస్తామని జెడాంగ్ పేర్కొన్నారు.
Read Also: RCB VS DC: సెంచరీపై కన్నేసిన విరాట్.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చాలు!
కాగా, అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. డ్రాగన్ దిగుమతులపై ఉన్న 20 శాతం పన్నులకు అదనంగా మరో 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దీనికి దీటుగా చైనా కూడా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం సుంకం విధించింది. ఇక, బీజింగ్ చర్యపై తీవ్రంగా మడిపడిన ట్రంప్.. 125 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల పలు దేశాలపై విధించిన సుంకాలపై అమెరికా అధినేత ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. 90 రోజుల పాటు ఆయా టారిఫ్‌లను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, వాటిపై 10 శాతం సుంకాలు మాత్రం అమల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు.