Robert Vadra: పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ దేశం బాధతో ఉంటే, కొందరు నాయకులు మాత్రం రాజకీయాలు, హిందూ-ముస్లిం అంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. పహల్గామ్ దాడిని ప్రధాని నరేంద్రమోడీకి సందేశంగా ఆయన అభివర్ణించాడు. ‘‘ముస్లింలు బలహీనంగా ఉన్నారు’’ అనే వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన దాడిలో హిందువుల్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో మైనారిటీలు అసౌకర్యంగా, ఇబ్బందిగా భావిస్తు్న్నారు’’ అన్నారు. బీజేపీ ‘‘హిందుత్వ’’ మద్దతు దీనికి కారణం అని అన్నారు.
Read Also: Lava Days Sale: ‘లావా డేస్ సేల్’ ప్రారంభం.. లావా అగ్ని 3, O3, O3 Pro ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!
‘‘మన దేశంలో, ఈ ప్రభుత్వం హిందూత్వం గురించి మాట్లాడుతుందని, మైనారిటీలు అసౌకర్యంగా మరియు ఇబ్బందిగా ఉన్నారని మనం చూస్తున్నాము. జరిగిన ఉగ్రవాద చర్యలో ఉగ్రవాదులు ప్రజలు గుర్తింపును పరిశీలించారు. ఇలా ఎందుకు చేస్తున్నాంటే, మన దేశంలో హిందువులు, ముస్లింలలో విభజన ఏర్పడింది’’ అని అన్నారు. ‘‘ఇది ప్రధానికి సందేశం, ముస్లింలు బలహీనంగా ఉన్నారని భావిస్తున్నారు. మైనారిటీలు బలహీనంగా ఉన్నారని భావిస్తున్నారు.’’ అని అన్నాడు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఈ వీడియోని షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ‘‘షాకింగ్! సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఉగ్రవాద చర్యను సిగ్గు లేకుండా సమర్థిస్తున్నారు, ఉగ్రవాదులను ఖండించడానికి బదులుగా వారికి కవర్ అందిస్తున్నారు. అతను అక్కడితో ఆగడు, బదులుగా, పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దురాగతాలకు భారతదేశంపై నిందను మోపుతున్నాడు’’ అని అన్నారు.
Shocking! Sonia Gandhi’s son-in-law Robert Vadra shamelessly defends an act of terror, offering cover to the terrorists instead of condemning them. He doesn’t stop there, instead, shifts the blame onto India for the atrocities committed by Pakistani terrorists. https://t.co/3CQlCmewjn
— Amit Malviya (@amitmalviya) April 23, 2025