Pahalgam attack: పహల్గామ్ దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి కొన్ని రోజులు ముందే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాశ్మీర్ తమ జీవనాడి అని, కాశ్మీర్ కోసం పోరాడుతున్నవారికి సాయం చేస్తామని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఉంటుందని చెప్పారు. మునీర్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే ఉగ్రదాడి జరిగింది. మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో, కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన అమాయకపు టూరిస్టుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడి వెనక పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది.
Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ టెర్రర్ అటాక్‌ని ఖండించిన చైనా..
దీనికి తోడు, ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని రావల్‌కోట్ లోని ఖై గాలాలో జరిగిన ఓ ర్యాలీలో లష్కరే తోయిబా కమాండర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జమ్మూ కాశ్మీర్‌లో జిహాద్, రక్తపాతానికి పిలుపునిచ్చాడు. జమ్మూ కాశ్మీర్ యునైటెడ్ మూవ్‌మెంట్ (జెకెయుఎం) ఉగ్రసంస్థ లీడ్ కమాండర్ అబూ ముసా, సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆర్టికల్ 370 రద్దు మరియు కాశ్మీర్ జనాభాను మార్చడానికి లోయలో దాడులకు పిలుపునిచ్చాడు.
‘‘భారతదేశం జనాభాను మార్చడానికి ఆర్టికల్ 370 మరియు 35ఎలను తొలగించింది. మీరు మీ 10 లక్షల మంది సైన్యాన్ని మోహరించారు. మీరు పుల్వామా, పూంచ్, రాజౌరిలో ‘రామ్ రామ్’ను ప్రతిధ్వనించాలనుకున్నారు. లష్కరే తోయిబా మీ సవాలును స్వీకరిస్తుంది. మూసివేసిన కోర్టు గదుల లోపల, మోడీ మీరు మీ ఆదేశాలను ఆమోదించారు. కానీ యుద్ధభూమి ముజాహిదీన్‌లది. ఇన్షా అల్లాహ్, మేము బుల్లెట్లను కురిపిస్తాము, మీ మెడలు కోస్తాము , మా అమరవీరుల త్యాగాలను గౌరవిస్తాము’’ అని విద్వేష ప్రసంగం చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Pakistani govt forces officially in uniform were providing security for the Lashkar-e-Taiba Terror conference in which LeT militant cmdr Abu Musa was heard spewing venom against Hindus in the Khaigala area of Rawalkot, Poonch #AzadKashmir (Pakistan occupied J&K). pic.twitter.com/A4zTDOY5QT
— Subcontinental Defender 🛃 (@Anti_Separatist) April 19, 2025