రెండేళ్ల క్రితం 2019 డిసెంబర్‌లో చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. వైరస్ వ్యాప్తి తరువాత ఇప్పుడు మరోసారి చైనాలో కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాని దక్షిణ ప్రావిన్స్‌లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దక్షిణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. డెల్టావేరియంట్ కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పుతియాన్ నగరంలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ ప్రజలను ఇంటికే పరిమితం చేశారు. ఇంటినుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు.
Read: ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…