చైనాలోని ఊహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో సహా అనేక దేశాలు కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీకయిందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో గతంలో పర్యటించిన తరువాత ల్యాబ్ నుంచి వచ్చిందా లేదా అన్నదానిపై మరింత విపులంగా పరిశోధించాలని పేర్కొన్నది. ల్యాబ్ నుంచి లీకైందని కొట్టిపారెయ్యలేమని చెప్పింది. మరోసారి చైనాలో పర్యటించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ…
చైనాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. హెనన్ ప్రావిన్స్ లో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు కురిశాయి. హెనన్ ప్రావిన్స్‌లోని జెంగ్జౌ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నగరంలో మంగళవారం రోజున 457.5 మీ.మీ వర్షం కురిసింది. గత వెయ్యి సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో వర్షం కురవలేదని అక్కడి వాతావరణ శాఖ…
చైనా మరో కొత్త ఆవిష్కరణకు తెరలేపింది. గంటకు 600 కిమీ వేగంతో దూసుకుపోయో అత్యాధునిక మాగ్లెవ్ రైలును ఆవిష్కరించింది. తూర్పు చైనాలోని షిడాంగ్ ప్రావిన్స్ కిండాన్ నగరంలో ఈ సరికొత్త మాగ్లెవ్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. మాగ్లెవ్ ప్రాజెక్టును 2016లో ప్రారంభించగా, మూడేళ్ల కాలంలో అయస్కాంత-వాయుస్తంభన ప్రోటోటైప్ రైలును 2019 లో ఆవిష్కరించారు. పది భోగీలతో కూడిన ఈ రైలులో ఒక్కోభోగీలో 100 మంది చోప్పున ప్రయాణం చేసే వీలుంటుంది. మాములు చక్రాల మాదిరిగా కాకుండా ఈ…
వియాత్నం విషయంలో చైనా ఏమాత్రం పట్టు వదలడం లేదు. తైవాన్ తమ ఆదీనంలోనే ఉందని ఇప్పటికీ స్పష్టం చేస్తున్నది. తైవాన్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది. అయితే, కొన్ని రోజుల క్రితం జపాన్ ఉప ప్రధాని తారో అసో తైవాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బయటి శక్తులు తైవాన్ పై ఆదిపత్యం చలాయించాలని చూస్తే ఊరుకోబోమని, అండగా ఉంటామని తైవాన్‌కు హామీ ఇచ్చారు. Read: అశ్లీల చిత్రాల కేసు: శిల్పా…
ప్రపంచాన్ని గడగడలాండించిన కోవిడ్ 19 వైరస్ చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే. కాగా, చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్నది. కోతుల నుంచి సంక్రమించే మంకీ బీ వైరస్ మానవుల్లో తొలికేసు నమోదయింది. తొలికేసు నమోదైన కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తి మరణించినట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి ఒక్కకేసు మాత్రమే నమోదైనట్టు చైనా సీడీసీ ప్రకటించింది. మంకీబీ సోకిన వ్యక్తి నుంచి మరోకరికి ఈ వైరస్ సోకలేదని చైనా చెబుతున్నది. జంతువులపై పరిశోధనలు…
భారత్‌లో స్మార్ట్ఫోన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిమాండ్‌కు అనుగుణంగానే కొత్తకొత్త బ్రాండ్లు, మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రతినెలా పదుల సంఖ్యలో మొబైల్ మోడల్స్ దర్శనమిస్తున్నాయి. ఇక చౌకైన డేటా ఆఫర్లు, అందుబాటు ధరల్లో ఫోన్లతో దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా మనదేశంలో స్మార్ట్ఫోన్లు వాడేవారి సంఖ్య జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాపారాలు ఎక్కువ అవ్వడం, విద్యార్థుల ఆన్లైన్ క్లాసులతో మొబైల్స్ అమ్మకాలు మరింత ఎక్కువ…
ఆసియాలో అన్ని దేశాలపై ఆదిపత్యం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ సముద్రంలోని పరాసెల్ దీవులు పరిధిలో ఉన్న సముద్ర జలాలు తమవే అంటే తమవే అని చైనా, వియాత్నం, తైవాన్లు వాదిస్తున్నాయి. ఇందులో బలం, బలగం అధికంగా ఉన్న చైనా ఈ జలాలపై ఆదిపత్యం చెలాయిస్తున్నది. 2016, జులై 12 వ తేదీన అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. ఈ…
ఆఫ్ఘన్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘన్‌లోని అనేక ప్రాంతాలను తమ స్వాదీనంలోకి తీసుకున్న తాలిబన్లు కాందహార్‌ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘన్లో ఉన్న 210 చైనీయులను చైనా గతవారం వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘన్ అంతర్గత ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసిన నేసథ్యంలో తాలిబన్లు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా దేశం ఆఫ్ఘనిస్తాన్‌కు మిత్రదేశంగా భావిస్తున్నామని, షిన్జీయాంగ్ ప్రావిన్స్‌లో వేర్పాటువాద ఉఘర్ ముస్లీంలకు తాము మద్ధతు ఇవ్వబోమని తాలిబన్లు చైనాకు హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో…
డ్రాగన్ కంట్రీ చైనా కొత్త ఎత్తులు వేస్తోంది. సరిహద్దుల్లో కుయుక్తులు పన్నుతోంది. భారత్‌పై పైచేయి సాధించేందుకు టిబెటన్లను రంగంలోకి దించుతోంది. మన దగ్గర ఉన్న ఎస్ఎఫ్ఎఫ్ బలగాల తరహాలోనే టిబెటన్లతో ప్రత్యేక దళాలను సిద్ధం చేస్తోంది. కుయుక్తులు.. దొంగ దెబ్బలు..! చైనాకు ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య..! లద్దాఖ్‌లో ఉద్రిక్తతల తర్వాత డ్రాగన్.. ఇలాంటి వాటికి మరింత పదునుపెట్టింది డ్రాగన్. ఎల్ఏసీ ఉద్రిక్తతల సమయంలో భారత ప్రత్యేక దళాలు.. వ్యూహాత్మకంగా కదిలాయి. ఎస్ఎఫ్ఎఫ్.. ప్రత్యేక సాయుధ బలగాలు..…
చైనా ప్రతి దేశంలో కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి అపవాదును తొలగించుకునేందుకు, ఆ విషయాలను పక్కదోవ పట్టించేందుకు చైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉన్నదేశాలతో నిత్యం పేచీ పెట్టుకుంటున్న డ్రాగన్, తైవాన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీంగా టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా, తైవాన్ దేశాన్ని కూడా తన ఆదీనంలోకి తీసుకుంటానని అంటోంది. టిబెట్ విషయంలో కూడా ఇదే దూకుడును ప్రదర్శించి…