చైనాలో మళ్లీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. మధ్యస్త, తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి రాజధాని బీజింగ్‌కు వచ్చే వారిపై నిషేదం విధించింది. కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే రైలు, రోడ్డు, విమాన మార్గాలపై కూడా నిషేదం విధించింది చైనా ప్రభుత్వం. ఎవరైనా సొంత వాహనాల్లో ఆయా ప్రాంతాల నుంచి రావాలనుకున్నా వారిని మధ్యలోనే నిలువరించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. మధ్యస్త, తీవ్రత…
కరోనా పుట్టినిల్లు చైనా ఇప్పుడు వణికిపోతోంది… రోజుకో కొత్త వేరియంట్ తరహాలో ప్రపంచాన్ని ఓ కుదుపు కుదేపిసింది కరోనా వైరస్.. ఇప్పుడు.. డెల్టా వేరియంట్ డ్రాగన్ కంట్రీ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది… చైనా వ్యాప్తంగా కొత్తగా 500 డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.. అవి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదు అయ్యాయి… దీంతో, అప్రమత్తం అయిన ప్రభుత్వం.. కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న 144 ప్రాంతాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్యాక్సీ సేవలను రద్దు చేసింది.. మరోవైపు.. బీజింగ్‌లోనూ…
చైనాలోని 17 ప్రావిన్స్‌లో కరోనా కేసుల పెరుగుతున్నాయి. సంవత్సరం తరువాత వూహాన్లో కొత్త కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో తిరిగి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కోటి మంది జనాభా ఉన్న వూహన్ నగరంలో అందరికీ టెస్టులు నిర్వహించి పాజిటివ్ ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచాలని చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఒక్క వూహాన్ నగరంలోనే కాకుండా ఆ దేశంలోని 17 ప్రావిన్స్‌లలో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ప్రాముఖ్యత కలిగిన నగరాలు, పర్యాటక పరంగా ప్రాముఖ్యత కలిగిన నగరాల్లో…
కరోనా పుట్టినిల్లు అయిన వుహాన్‌లో మళ్లీ వైరస్ కలకలం రేపుతోంది. దాదాపు ఏడాది తర్వాత వుహాన్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో చైనాలో 84 కేసులు నమోదు కాగా.. అందులో ఎనిమిది మంది వుహాన్ వాళ్లే ఉన్నారు. వుహాన్‌లో బయటపడ్డ కేసుల్లో ముగ్గురిలో కరోనా లక్షణాలు ఉండగా.. ఐదుగురు అసింప్టమాటిక్ అని తేలింది. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచడంతో పాటు వారి కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నారు. అంతేకాకుండా వుహాన్‌లోని దాదాపు కోటి మంది జనాభాకు పరీక్షలు చేయాలని…
2019 డిసెంబర్లో వూహాన్లో కరోనా మొదటి కరోనా కేసు వెలుగుచూసింది. అక్కడి నుంచి కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. అయితే, కరోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. ప్రజలను ఇంటికే పరిమితం చేసింది. ఆ తరువాత ఆ నగరం మెల్లిగా కరోనా నుంచి కోలుకుంది. అయితే, సంవత్సరం తరువాత మళ్లీ వూహన్ కరోనా కేసు నమోదైంది. దీంతో ఆ నగరంలో కరోనా కలకలం రేగింది. సంవత్సరం తరవాత…
కరోనా అంటే చైనా గుర్తుకు వస్తుంది. చైనాలోని వూహన్ నుంచి ఈ వైరస్ మొదలై ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. రెండేళ్లుగా కరోనాతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. చైనాలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణంగా దాదాపుగా 40 కోట్లకు పైగా పందులు మరణించాయి. దీంతో చైనీయులు మాంసం కోసం అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో ఆయా దేశాలు ఈ మాంసం ధరలను భారీగా పెంచేశాయి. పైగా, కరోనా కారణంగా ఎగుమతులపై ఆయా దేశాల్లో…
2019 నవంబర్ నుంచి చైనాలో కరోనా కేసులు బయటపడటం మొదలుపెట్టాయి. డిసెంబర్ నుంచి కేసులు పెరగడం మొదలుపెట్టాయి. చైనా నుంచి కేసులు ఇతర దేశాలకు వ్యాపించడం మొదలయ్యాయి. ఆ తరువాత ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తూ వచ్చారు. గత రెండేళ్లుగా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా కరోనా ఏ మాత్రం తగ్గడంలేదు. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ రూపాంతరాలు చెందుతూ బలం పెంచుకొని మరోమారు విజృంభిస్తున్నది. ప్రపంచంలోని దాదాపుగా 130 దేశాల్లో…
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి.. భారత్‌ను శుభారంభాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి… 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. ఈ ఈవెంట్లో చైనా వెయిట్‌లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ, ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.. ఇప్పటికే మీరాబాయి చాను.. టోక్యో నుంచి భారత్‌కు చేరుకోగా… టోక్యోలోనే ఉండాల్సిందిగా హౌను ఆదేశించారు ఒలింపిక్స్ నిర్వహకులు. ఈ…
ఇండియాపై చైనాకు ఎంతటి కుట్ర ఉన్నదో అందరికి తెలిసిందే. ఆర్ధికంగా ఇండియా ఎదుగుతుండటంతో చైనా ఓర్వలేకపోతున్నది. ఆసియాలో ఆదిపత్యం చెలాయించాలని చూస్తున్న చైనాకు ఇండియా నుంచి గట్టిపోటీ ఎదురుకానుండటంతో కుట్రలు చేస్తున్నది. కరోనా మహమ్మారి తరువాత చైనా అంటే ప్రపంచం మొత్తానికి ఒక విధమైన భావన ఏర్పడింది. చైనా కావాలనే ల్యాబ్ నుంచి కరోనా వైరస్‌ను లీక్ చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించడమే కాకుండా ఆ దేశానికి చెందిన…