ఒకప్పుడు అమెరికా రష్యా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు దేశాల మధ్య పచ్ఛన్నయుద్ధం జరిగింది. అయితే, 1991 దశకంలో యూఎస్ఎస్ఆర్ విచ్చిత్తి కావడంతో రష్యా ఆర్థికంగా కుదేలయింది. దీంతో అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండు దశాబ్దాల కాలంగా ఆసియాలో చైనా ఆర్థికంగా క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా తరువాత రెండో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇప్పుడు అమెరికాను సవాల్ చేసే స్థాయికి ఎదగడంతో అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్యపరమైన సవాళ్లు ఎదురౌతున్నాయి. ఆర్థిక, రక్షణపరమైన సవాళ్లు విసురుకుంటున్నాయి. రెండు బలమైన దేశాలు ఇలా సవాళ్లు విసురుకోవడం వలన భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, తద్వారా మరోసారి ప్రచ్ఛన్న యుద్ధం రావొచ్చని, ఫలితంగా ప్రపంచ దేశాలు రెండు ముక్కలుగా అయ్యే అవకాశం ఉంటుందని ఐరాస ఆందోళన చెందుతున్నది. ఇలానే కొనసాగితే వీటిని కంట్రోల్ చేయడం సాధ్యంకాకపోవచ్చని, సమస్యకు వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని ఐరాస ప్రపంచ దేశాలను కోరింది.